https://oktelugu.com/

KCR Congress: పొత్తు కోసం సోనియా వద్దకు కేసీఆర్ వెళ్లాడా? అసలేం జరిగింది?

KCR Congress: దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటి అవుతూ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో లాబీయింగ్ చేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ను కలపబోతున్నాడని జోరుగా ఊహాగానాలు సాగాయి. పీకే కాంగ్రెస్ లో చేరుతాడని.. కాంగ్రెస్ లోనే టీఆర్ఎస్ విలీనం అవుతుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా కోమటిరెడ్డి మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు. అసలు కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీఆరే ప్రయత్నించారని.. కాంగ్రెస్ కాదని […]

Written By:
  • NARESH
  • , Updated On : April 28, 2022 / 04:52 PM IST
    Follow us on

    KCR Congress: దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటి అవుతూ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో లాబీయింగ్ చేశారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ ను కలపబోతున్నాడని జోరుగా ఊహాగానాలు సాగాయి. పీకే కాంగ్రెస్ లో చేరుతాడని.. కాంగ్రెస్ లోనే టీఆర్ఎస్ విలీనం అవుతుందని ప్రచారం సాగింది. అయితే తాజాగా కోమటిరెడ్డి మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు.

    అసలు కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీఆరే ప్రయత్నించారని.. కాంగ్రెస్ కాదని కోమటిరెడ్డి బాంబు పేల్చాడు. కాంగ్రెస్ తో పొత్తు కోసం కేసీఆర్ సోనియాను సంప్రదించారని తెలిపారు. అయితే సోనియా ఈ ప్రతిపాదనను నిర్మోహమాటంగా తిరస్కరించారని.. గతంలో మోసం చేసిన కేసీఆర్ ను నమ్మేది లేదని తెగేసి చెప్పారని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అప్పట్లో కేసీఆర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ లో విలీనం చేయకుండా ఒంటరిగా పోటీచేసి మరీ కాంగ్రెస్ ను ఓడించాడు. పైగా కాంగ్రెస్ ను చావుదెబ్బ తీస్తూ ఆ పార్టీ నేతలను లాగేస్తూ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారు.

    ఈ కారణంగానే కేసీఆర్ ఆఫర్ ను సోనియాగాంధీ తిరస్కరించారని.. కేసీఆర్ తో పొత్తు పెట్టుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారని కోమటిరెడ్డి చెబుతున్నారు.

    ప్రస్తుతం రెండు సార్లు గెలిచిన కేసీఆర్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ బలం తెలంగాణ అంతటా లేదు. సో ఈసారి తెలంగాణలో గెలిచే పార్టీగా కాంగ్రెస్ ఉందని.. అందుకే కేసీఆర్ అన్నీ వదిలేసి కాంగ్రెస్ తో పొత్తుకు వెంపర్లాడుతున్నాడని కోమటిరెడ్డి ఆరోపించారు.

    అయితే కోమటిరెడ్డి విశ్లేషణ కరెక్టో రాంగో కానీ.. ఈ విషయం మాత్రం నమ్మేలానే కనిపిస్తోంది. కేసీఆర్ తో పీకే చర్చలు.. అంతకుముందు సోనియాతో సంప్రదింపులు జరిగాక నిజంగానే కాంగ్రెస్ తో పొత్తుకు కేసీఆర్ ప్రయత్నించి ఉంటారని కోమటిరెడ్డి మాటలను బట్టి అర్థమవుతోంది.

    Recommended Videos