UP Elections 2022: యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?

UP Elections 2022:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో పోటీ చేసిన ఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఒక్కస్థానం గెలుచుకోలేదు. మొత్తం 100 సీట్లలో పోటీ చేసినా ఒక్కడా ప్రభావం చూపలేదు. అయితే ముందుగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఎం.డి.(ముస్లిం దళిత) ఫార్మూలా ఉపయోగించినా ఫలించలేదు. దీంతో మిగతా రాష్ట్రాల్లో పాగా వేద్దామనుకున్న ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. తెలంగాణలోని పాత బస్తీలో […]

Written By: NARESH, Updated On : March 11, 2022 10:29 am
Follow us on

UP Elections 2022:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ విజయం సాధించింది. ఈ రాష్ట్రంలో పోటీ చేసిన ఎంఐఎం(ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్) ఒక్కస్థానం గెలుచుకోలేదు. మొత్తం 100 సీట్లలో పోటీ చేసినా ఒక్కడా ప్రభావం చూపలేదు. అయితే ముందుగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఎం.డి.(ముస్లిం దళిత) ఫార్మూలా ఉపయోగించినా ఫలించలేదు. దీంతో మిగతా రాష్ట్రాల్లో పాగా వేద్దామనుకున్న ఆ పార్టీ అంచనాలు తారుమారయ్యాయి. తెలంగాణలోని పాత బస్తీలో జోరుమీదున్న ఆ పార్టీ మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీలో ఒక్కో సీటు గెల్చుకుంది. అదే ఊపుతో ఉత్తరప్రదేశ్లో 100 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం గమనార్హం. పైగా ఎంఐఎం పోటీతో బీజేపీకి లాభించిందిన రాజకీయంగా చర్చ సాగుతోంది.

ఉత్తరప్రదేశ్లోని ముస్లింలు, బీసీలు, దళితుల్లో మద్దతున్న పార్టీలతో కలిసి ‘భాగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో కూటమి ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగారు అసదుద్దీన్. ముస్లింలతో పాటు దళితును ఆకట్టుకోవడానికి ఈ కూటమిని ఏర్పాటు చేశారు. బాబుసింగ్ కుష్యహా సారథ్యంలో జన్ అధికారి పార్టీ, వామన్ మేప్రామ్ నేతృత్వంలో భారత్ ముక్తి మోర్చా, అనిల్ సింగ్ చౌహాన్ నాయకత్వంలోని జనత క్రాంతి పార్టీ, రాంప్రసాద్ కశ్యప్ కు చెందిన భారతీయ విచిత్ సమాజ్ పార్టీలో ఈ కూటమిలో ఉన్నాయి.

తాము అధికారంలోకి వస్తే దళితులు, బీజీలకు న్యాయం చేస్తామని ప్రచారం చేశారు. అంతేకాకుండా ఒక దళిత సీఎం, ఒక ఓబీసీ సీఎం చొప్పున ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ముస్లిం ఉప ముఖ్యమంత్రి సహా ముగ్గురు ఉపముఖ్యమంత్రులు ఉంటారని అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. ఇక తన ప్రచారంలో అంబేద్కర్ పేరు ప్రస్తావించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హిజాబ్ విషయాన్ని లెవనెత్తి బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో హాపూర్ జిల్లాలో ఫిబ్రవరి 3వ తేదీన ఎన్నికల ప్రచారంలో ఉండగా అసదుద్దీన్ కారుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల దర్యాప్తు బాధ్యత మోదీ ప్రభుత్వానిదేనని డిమాండ్ చేశారు. అయితే ఈ కాల్పులపై స్పందించిన కేంద్రం అసదుద్దీన్ కు జడ్ కేటగిరి కల్పిస్తామని తెలిపింది. కానీ తనకు జడ్ కేటగిరి భద్రత అవసరం లేదని చెప్పారు. తనపై పేలిన తూటాలకు యూపీ ప్రజలు బ్యాలెట్లతో సమాధానం చెబుతారని అన్నారు.

2017 ఎన్నికల్లోనూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఆ సమయంలో 38 స్థానాల్లో పోటీ చేసిన ఈ పార్టీ ఎక్కడా గెలుపొందలేదు. 37 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. ఇక 2022 ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేసినా అదే ఫలితం దక్కింది. ఏ ఒక్కస్థానంలోనూ రెండో స్థానంలో కూడా ఎంఐఎం కనిపించలేదు. మొత్తం మీద ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి 0.45 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థులను ప్రకటించినప్పుడు కనీసం 10 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత చెప్పారు. బహ్రాయిచ్ జిల్లాలోని నాన్పారా, అయోధ్య జిల్లాలోని రాదౌలి, సిద్ధార్థ్ నగర్ జిల్లాలోని దొమరియాగంజ్ తదితర జిల్లాలో తమ పార్టీ గెలుస్తునందని చెప్పారు.

యూపీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసి గెలవకపవడమే కాకుండా బీజేపీకి లాభం చేసిందని అంటున్నారు. హిందూ ఓట్లు బీజేపీకి పడేలా.. ముస్లిం ఓట్లు వేరే ప్రతిపక్ష పార్టీకి కాకుండా ఎంఐఎంకు పడ్డాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా ఈ వ్యూహంలో బీజేపీ బాగా లాభపడిందని అంటున్నారు. ఎంఐఎం తన ఉనికిని చాటుకోవడానికి, ముస్లింలలో పట్టు పెంచుకోవడానికి ప్రయత్నించినా బీజేపీకి పరోక్షంగా లాభం చేకూరిందని అంటున్నారు.