Homeక్రైమ్‌Dharmasthala mass burial case: 'ధర్మస్థలి' వెళ్లిన అమ్మాయిలందరిపై ఆ అఘాయిత్యం.. తిరిగిరాలేదు.. షాకింగ్ నిజాలు

Dharmasthala mass burial case: ‘ధర్మస్థలి’ వెళ్లిన అమ్మాయిలందరిపై ఆ అఘాయిత్యం.. తిరిగిరాలేదు.. షాకింగ్ నిజాలు

Dharmasthala mass burial case: పక్షం రోజులుగా వార్తల్లో నిత్యం వినిపిస్తున్న పేరు ధర్మస్థల.. పరమ శివుడు మంజునాథుడిగా కొలువై ఉన్న పవిత్ర కేత్రం అది. కానీ, అక్కడ గతంలో పనిచేసిన ఓ పారిశుధ్య కార్మికుడు తాజాగా బయట పెట్టిన అపవిత్ర పనులు చర్చనీయాంశమయ్యాయి. వాటిపైనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. కర్నాటక ప్రభుత్వం కూడా సిట్‌ ఏర్పాటు చేసింది. తాజాగా ఈకేసులో లభించిన ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారాయి..

కర్ణాటకలోని ధర్మస్థల, ఒక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ప్రదేశం, ఇప్పుడు దారుణమైన నేరాల కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రాంతంలో యువతులపై జరిగిన అత్యాచారాలు, హత్యలను మాజీ పారిశుధ్య కార్మికుడు బయటపెట్టాడు. అతడు పోలీసులకు చేసిన ఫిర్యాదు దిగ్భ్రాంతికర విషయాలను బయటపెట్టింది. ఈ పుణ్యక్షేత్రం నీడలో జరుగుతున్న నేరాలు సమాజాన్ని కలచివేస్తున్నాయి. యువతులు, స్థానిక మహిళలు అత్యాచారానికి గురై, ఆ తర్వాత హత్య చేయబడి, ఆధారాలను దాచిపెట్టే క్రూరత్వం ఈ కేసులో బహిర్గతమైంది.

సాక్ష్యాలు వెలుగులోకి..
ఈ కేసు బయటకు రావడానికి కారణం ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడి ధైర్యం. అతని ఫిర్యాదు దర్యాప్తును ప్రారంభించింది, దీనితో ధర్మస్థలలో దాగిన భయంకర నిజాలు బహిర్గతమయ్యాయి. ధర్మస్థల కేసు సమాజంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. పుణ్యక్షేత్రాల వంటి ‘పవిత్ర’ ప్రదేశాల్లో కూడా ఇటువంటి నేరాలు జరగడం రక్షణలో లోపాలను బట్టబయలు చేస్తుంది. న్యాయవ్యవస్థ ఈ కేసులో ఎలా స్పందిస్తుంది? బాధితులకు న్యాయం జరుగుతుందా? ఇవి ప్రస్తుతం కీలకమైన ప్రశ్నలు. అంతేకాక, స్థానిక సమాజంలో ఈ ఘటనలు సృష్టించిన భయం, అవిశ్వాసం దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular