Yadadri: వానలకు రోడ్లు కుంగాయి. ఆలయ గోడల పై నీటి చెమ్మ కనిపించింది. నిర్మాణంలోనే రాతి స్తంభాల పై కేసీఆర్ బొమ్మలు వేశారు. కారు గుర్తులు చెక్కారు. చిన జీయర్ తో గ్యాప్ వల్ల ఆలయం ప్రారంభం సో సో గా జరిగింది. ఇక ఇన్నేసి ఉక్కపోతల తర్వాత, ఇప్పుడున్న ఒత్తిళ్ల మధ్య ఉన్న కేసీఆర్ కు ఆదివారం చాలా ఉపశమనం ఇచ్చింది. పింక్ మీడియాకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. యాదగిరి నర్సన్న ను ఒక్క ఆదివారం నాడే 60 వేల మంది దర్శించుకున్నారు. కోటి ఆదాయాన్ని కూడా ఇచ్చారు.
కిటకిట
యాదగిరి గుట్ట యాదాద్రి గా మారిన తర్వాత, గుట్ట కింద పాడు వృతి చేసే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిన తర్వాత యాదగిరి గుట్ట మారింది. దీంతో జనం కూడా నర్సన్న దర్శనానికి క్యూ కట్టారు. హైదరాబాద్ కు కొద్ది దూరం లో ఉండటంతో ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రాంతాల ప్రజలు వారాంతాల్లో, పండగలప్పుడు క్యూ కడుతున్నారు. ప్రధాన ఆలయ ఉద్ఘాటన అనంతరం ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ముఖ్యంగా సెలవు, పండగలప్పుడు రద్దీ బాగా ఉంటున్నది. కార్తీక మాసం, వరుస సెలవులు రావడంతో నర్సన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. సుమారు 60 వేల మంది దర్శించుకున్నారు. వివిధ మార్గాల ద్వారా ఆలయానికి కోటి వరకు ఆదాయం సమకూరింది.
ఇలా దర్శనం
40 వేల మంది ధర్మ దర్శనం, 15,100 మంది వీఐపీ, 2,317 మంది బ్రేక్ దర్శనం చేసుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పట్టింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొండ కింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో తులసీ దామోదర వ్రతం నిర్వహిస్తున్నారు. ₹ 516 టికెట్ కొన్న దంపతులకు వ్రతంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు.