https://oktelugu.com/

ఎవరు అవునన్నా.. కాదన్నా.. ఆమే అంబాసిడర్‌‌

రెండు రోజులుగా తెలంగాణ టూరిజం శాఖ వార్తల్లో ఉంది. టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను నియమించగా.. ఆమె నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ మరుసటి రోజే ఆమెను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అసలు హారిక ఎవరో తెలియదని పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో దుమారం చెలరేగింది. కానీ.. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. Also Read: బెంగాల్ లోనూ అదే సీన్ : ఏపీ పరిస్థితి రిపీట్ అవుతుందా..? టీఎస్‌టీడీసీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 10, 2021 / 04:11 PM IST
    Follow us on


    రెండు రోజులుగా తెలంగాణ టూరిజం శాఖ వార్తల్లో ఉంది. టీఎస్‌టీడీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారికను నియమించగా.. ఆమె నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ మరుసటి రోజే ఆమెను తొలగించినట్లు వార్తలు వచ్చాయి. అసలు హారిక ఎవరో తెలియదని పర్యాటకశాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అనడంతో దుమారం చెలరేగింది. కానీ.. అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు.

    Also Read: బెంగాల్ లోనూ అదే సీన్ : ఏపీ పరిస్థితి రిపీట్ అవుతుందా..?

    టీఎస్‌టీడీసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా.. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా దేత్తడి హారికే ఉంటారని స్పష్టం చేశారు. హిమాయ‌త్ న‌గ‌ర్‌లోని తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ కార్యాల‌యంలో ఎండీ మ‌నోహ‌ర్ రావుతో క‌లిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారికను తొల‌గించార‌ని ప‌లు మీడియా చాన‌ళ్లలో వ‌స్తున్న వార్తలను ఆయ‌న ఖండించారు.

    ‘దేత్తడి హారిక తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా తొల‌గించార‌న్న వార్తల్లో నిజం లేద‌ు. తెలంగాణ టూరిజానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీ‌నివాస్ గౌడ్ నాయ‌క‌త్వంలో ముందుకు వెళుతున్నాం. అందుకోస‌మే టూరిజాన్ని ప్రమోట్ చేసుకునేందుకు త‌క్కువ ఖ‌ర్చుతో ప్రచారం చేస్తున్నాం. ఈ నేప‌థ్యంలోనే దేత్తడి హారికను నియ‌మించ‌డం జ‌రిగింది’ అని చెప్పుకొచ్చారు.

    Also Read: హిందూ నినాదం.. కవితకు వర్కౌట్ అవుతుందా..?

    ‘ఇప్పటికే ఈ విష‌యంలో మంత్రులు, ఉన్నతాధికారుల‌ను సంప్రదించే ముందుకు వెళ్లాం. అయితే కొంద‌రు గిట్టని వాళ్లు దేత్తడి హారిక‌ను తొల‌గించిన‌ట్లు దుష్ప్రచారం చేస్తున్నార‌ు. ఇలాంటివి న‌మ్మొద్దు. తెలంగాణ టూరిజాన్ని నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు కృషి చేస్తున్నం. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దేత్తడి హారిక‌నే కొన‌సాగుతార‌ు’ అని శ్రీనివాస్ గుప్తా స్పష్టం చేశారు. మొత్తంగా శ్రీనివాస్‌ గుప్తా స్పందనతో ఈ వివాదానికి బ్రేక్‌ పడింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్