NTR statue Contravercy : ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం.. మళ్లీ ఏపీ అంటుకుంది.. తప్పెవరిది?

NTR statue Contravercy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా హీటెక్కుతున్నాయి. సమయం సందర్భం ఏదైనా సరే సందు దొరికితే చాలు అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఎత్తుగడలను ప్రతిపక్షాలు వేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ తనకున్న బలమైన మీడియా, నేతల సహాయంతో వైసీపీని కార్నర్ చేస్తోంది. ఎక్కడో ఏదో ఒక మూల ఒక వైసీపీ నేతకు పిచ్చెక్కి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాడు. ఇంకా పూర్తిగా కూలగొట్టలేదు. దాన్ని వీడియో తీసి షేర్ […]

Written By: NARESH, Updated On : January 3, 2022 3:56 pm
Follow us on

NTR statue Contravercy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా హీటెక్కుతున్నాయి. సమయం సందర్భం ఏదైనా సరే సందు దొరికితే చాలు అధికార పక్షాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే ఎత్తుగడలను ప్రతిపక్షాలు వేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ తనకున్న బలమైన మీడియా, నేతల సహాయంతో వైసీపీని కార్నర్ చేస్తోంది.

NTR-demolish

ఎక్కడో ఏదో ఒక మూల ఒక వైసీపీ నేతకు పిచ్చెక్కి సీనియర్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఆరంభించాడు. ఇంకా పూర్తిగా కూలగొట్టలేదు. దాన్ని వీడియో తీసి షేర్ చేయడంతో వైరల్ గా మారింది. అంతే దాన్ని సీఎం జగన్, మంత్రులే కూలగొట్టించారన్నట్టుగా ప్రచారం హోరెత్తిస్తున్నారు. దీన్ని తెలుగువారి ఆత్మగౌరవంపై దాడిగా అభివర్ణిస్తున్నారు.

ఇక ఇలా ఎన్టీఆర్ విగ్రహంపై దాడి జరిగిందో లేదో ఆయన కుమారుడు నందమూరి రామకృష్ణ ఎంట్రీ ఇచ్చి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక టీడీపీలో చేరకున్నా.. ఆ పార్టీ తరుఫున ఒంటికాలిపై నిలబడే రఘురామ అయితే దేవుడి(ఎన్టీఆర్) విగ్రహాలపై దాడులా? అంటూ విరుచుకుపడ్డారు. ఇక మీడియా పొద్దున్నుంచి ఇదే పనిగా పెట్టుకుంది.

ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన ఏపీ రాజకీయాల్లో రచ్చగా మారింది. ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్త అని ప్రచారం చేయడంతో టీడీపీ ఏకంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. దీంతో దుర్గిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు.

ఇక వైసీపీ ఆగడాలకు కూడా ఏపీలో హద్దే లేకుండా పోతోంది. ఇప్పటికే ఓసారి జగన్ ను తిట్టినందుకు ఏకంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. అయినా అప్పుడు చర్యలేం తీసుకోలేదు. తాజాగా ఎన్టీఆర్ విగ్రహాన్ని కూలగొట్టినా చర్యలేం లేకుండా పోయాయి. అటు టీడీపీ వ్యవహారశైలి.. ఇటు వైసీపీ అంతకుమించిన దూకుడుతో ఏపీలో రాజకీయంగా రణరంగంగా మారుతోంది.