https://oktelugu.com/

MLC Kavitha: కళ తప్పిన కవిత.. అరెస్ట్‌ భయమే ఆమెను వెంటాడుతుందా!?

MLC Kavitha: కల్వకుంట్ల కవిత.. సంప్రదాయ చీరకట్టు.. ముఖంపై చెదరని చిరునవ్వు. తెలంగాణ సంప్రదాయానికి నిండైర రూపంగా కనిపిస్తుంది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. ఉత్సాహంగా కనిపిస్తారు. పంచ్‌ డైలాగ్స్‌తో ప్రతిపక్షాలను విమర్శిస్తారు. కానీ, ప్రస్తుతం ఆ పంచ్‌ డైలాగ్స్‌ పేలడం లేదు.. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లలో నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి’ ఇదీ నెల క్రితం ఆమె చెప్పిన చివరి పంచ్‌. ప్రస్తుతం ఆమెను బయట కనిపించడం లేదు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 14, 2023 3:34 pm
    Follow us on

    MLC Kavitha

    MLC Kavitha

    MLC Kavitha: కల్వకుంట్ల కవిత.. సంప్రదాయ చీరకట్టు.. ముఖంపై చెదరని చిరునవ్వు. తెలంగాణ సంప్రదాయానికి నిండైర రూపంగా కనిపిస్తుంది. ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా.. ఉత్సాహంగా కనిపిస్తారు. పంచ్‌ డైలాగ్స్‌తో ప్రతిపక్షాలను విమర్శిస్తారు. కానీ, ప్రస్తుతం ఆ పంచ్‌ డైలాగ్స్‌ పేలడం లేదు.. ‘తెలంగాణ ఆడబిడ్డ కళ్లలో నీళ్లు రావు.. నిప్పులు వస్తాయి’ ఇదీ నెల క్రితం ఆమె చెప్పిన చివరి పంచ్‌. ప్రస్తుతం ఆమెను బయట కనిపించడం లేదు. తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో కనిపించారు. రెండు మూడు అంశాలపై మాట్లాడారు. ఆమెను గమనించిన వారంతా ఆశ్చర్య పోతున్నారు. సాదాసీదాగా ఆమా ఆహార్యం ఉంది. ముఖంలో తెలియని ఆందోళన కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ ఎన్నికల్లో ఓడిపోయిన సమయంలో కవిత ముఖంలో ఇలాంటి ఆందోళనే కనిపించింది. తాజాగా అదే హావభావాలు కవిత ముఖంలో కనిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఆందోళన అంతా లిక్కర్‌ స్కాంలో అరెస్ట్‌ గురించే అని పేర్కొంటున్నారు.

    Also Read: Telangana Politics: ఈసారి తెలంగాణలో హంగ్‌ వస్తే పరిస్థితి ఏంటి?

    మండలిలో అన్నతో మంతనాలు..
    ఢిల్లీ లిక్కర్‌ స్కాంట్‌లో ఈడీ దూకుడు పెంచింది. ఇన్నాళ్లూ చార్జిషీట్ల దాఖలకే పరిమితమైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పుడు అరెస్ట్‌లకు దిగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్‌ చేసింది. అంతకంటే ముందు కవిత మాజీ ఆడిటర్‌ బుజ్జిబాబును అరెస్ట్‌ చేసింది. దీంతో కవితలో గుబులు మొదలైనట్లు కనిపిస్తోంది. వరుస అరెస్ట్‌లతో కవిత కలవర పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే కవిత కూడా అరెస్ట్‌ అవుతుందన్న సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ చేస్తోంది. దీంతో కవితలో టెన్షన్‌ స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై శాసన మండలిలో తన అన్న, మంత్రి కేటీఆర్‌ ప్రసగిస్తున్న సమయంలోనూ కవిత ముఖంలో తెలియని ఆందోళన కలినిపించింది. ప్రసంగం తర్వాత కవిత తన అన్న వద్దకు వెళ్లి లిక్కర్‌స్కాం అరెస్ట్‌పై మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా కూడా కవిత మోములో ఎక్కడా యాక్టివ్‌నెస్‌ లేకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

    పలు చార్జీషీట్లలో కవిత పేరు..
    తెలంగాణ ముఖ్యమంత్రి ముద్దుల తనయ కల్వకుంట్ల కవితపేరు ఇప్పటి వరకు ఈడీ దాఖలు చేసిన నాలుగు చార్జీషీట్లలో ఉంది. దానికి సబంధించిన ఆధారాలు, వివరణలతో ఈడీ కోర్టుకు చార్జిషీట్‌ సమర్పించింది. సౌత్‌ గ్రూప్‌ను కవిత అన్నీ తానై నడిపించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో ఎవిyð న్స్‌ దొరకకుండా తన సెల్‌ఫోన్లు డ్యామేజ్‌ చేసినట్లు కూడా స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆమె మాజీ ఆడిటర్, తెలుగు వ్యక్తులను అరెస్ట్‌ చేయడం, తాజాగా ఏపీ ఎంపీ కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించడం కవితను కలవరపాటుకు గురిచేస్తోందని తెలుస్తోంది.

    MLC Kavitha

    MLC Kavitha

    సోషల్‌ మీడియాలో ట్రోల్‌..
    ఇక తెలంగాణ సీఎం కూతురుగా కవితను బీజేపీ నేతలు సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ చేస్తున్నారు. లిక్కర్‌ క్వీన్‌గా కవితను అభివర్ణిస్తున్నారు. కోట్ల రూపాయలు ఈ స్కాంలో కవితకు ముట్టాయని కూడా ఆరోపిస్తున్నారు. త్వరలోనే కవిత జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొంటున్నారు. ఈ ట్రోలింగ్‌ కూడా కవితను టెన్షన్‌ పెడుతోంది. ఈ పరిణామాలతో చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. మొదట ఆరోపణలు వచ్చినప్పుడు ఖండించిన కవిత ఇప్పుడు ఖండించేందుకు కూడా మీడియా ముందుకు రావడం లేదు.

    బుచ్చిబాబు, రçఘవరెడ్డి విచారణ తర్వాత అరెస్ట్‌ తప్పదా..
    కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రఘవరెడ్డిని ఈడీ విచారణ చేస్తోంది. గతంలో అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డిని కూడా విచారణ చేసింది. కవిత అరెస్ట్‌ కోసం ఈడీ పూర్తిస్థాయి ఆధారాలు సేకరిస్తోందని తెలుస్తోంది. తాజాగా బుచ్చిబాబును మరికొందరితో కలిసి విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ తర్వాత అంటే మరో పది రోజుల తర్వాత కవిత అరెస్ట్‌ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే కవిత రోజులు లెక్కపెట్టుకుంటూ భయం భయంగా గడుపుతున్నారని, ఆమెకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

    Also Read: Jagan Stickers: ఏపీలో స్టిక్కర్ రాజకీయాలు .. చెరిగిపోతే పచ్చబొట్లు వేస్తారేమో

    Tags