Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న జరిగిన పేలుడు.. ఆ తర్వాత జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 15 ఏళ్ల నాటి ఉగ్రకుట్ర బయటపడింది. ఇక ఇందుకు మూలం డాక్టర్ షాహిన్ సాయిద్‌గా నిర్ధారించారు. 2020 నుంచి యాక్టివ్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. హరియాణాలోని పరీదాబాద్ అల్‌ఫలా యూనివర్సిటీకి సంబంధించిన ఉగ్ర కార్యకలాపాలు వెలుగుచూసాయి. డాక్టర్ షాహీన్ సయిద్ ఈ ఉగ్రముఠాలో కీలక హోదాలో వ్యవహరిస్తోంది. ఆమె జైష్ ఎ మహ్మద్ సంస్థతో అనుబంధం కలిగి, ప్రత్యేకంగా కాన్పూర్‌లో 19 మంది మహిళలతో ఒక మాడ్యూల్ ఏర్పరచింది.
Also Read: చంద్రబాబు రైతు బాట!
మహిళా ఉగ్రముఠా..
కాన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన 19 మంది మహిళల ఉగ్రముఠా ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తూ వచ్చింది. ఆయుధాలు సరఫరా చేసింది. ఆశ్రయం కల్పించింది. సమాచారం చేరవేసింది. ఢిల్లీ పేలుళ్ల తర్వాత వీరు అన్నీ మొబైల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలో దిగినట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఈ కేసులో కాన్పూర్ ప్రాంతం నుంచి అన్వేషణ చేపట్టింది. ఈ పరిణామాలు దేశ భద్రతకు తీవ్రదోషాలు కలిగించే సందర్భంగా, ఉగ్రవాద కట్టుబాటును పునఃస్థాపించేందుకు ఆఫీసర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
దేశ భద్రతకు సవాల్..
అల్‌ఫలా యూనివర్సిటీలో రూపొందిన ఉగ్ర కుట్ర చివరి నిమిషంలో బయట పడింది. వారు డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర చేశారు. నెల రోజుల ముందు కుట్రను మన నిఘావర్గాలు గుర్తించాయి. కశ్మీర్‌లో ఇంద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతలోనే ఢిల్లీలో పేలుడు జరిగింది. 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ పట్టుబడింది. కుట్రను ఛేదించకపోయి ఉంటే దేశం అల్లకల్లోలం అయ్యేదని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తంగా మన దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ కుట్ర మూలాలు.. దాని వెనుక ఉన్న సంస్థలు, దేశాలను కూడా టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌లో వణుకు మొదలైంది.