https://oktelugu.com/

AP Employees: పీఆర్సీ అమలులో జాప్యం ఎందుకు.? ఉద్యోగ సంఘాల్లో చీలిక ఎలా మొదలైంది.?

AP Employees:  ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య వాదోపవాదనలు నడుస్తున్నాయి. పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా.. ప్రజాప్రతినిధులు మాత్రం జాయిట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం అయిందని, ఎప్పుడో నివేదిక ఇచ్చిన దానిని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే సచివాలయ ఉద్యోగ సంఘాలు మాత్రం అనవసరంగా వివాదం చేయొద్దని ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరుస్తుందని తెలుపుతున్నాయి. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2021 / 09:12 AM IST
    Follow us on

    AP Employees:  ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా ప్రభుత్వానికి, ఉద్యోగుల మధ్య వాదోపవాదనలు నడుస్తున్నాయి. పీఆర్సీ అమలు కోసం ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండగా.. ప్రజాప్రతినిధులు మాత్రం జాయిట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నాయి. కానీ ఇప్పటికే ఆలస్యం అయిందని, ఎప్పుడో నివేదిక ఇచ్చిన దానిని అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే సచివాలయ ఉద్యోగ సంఘాలు మాత్రం అనవసరంగా వివాదం చేయొద్దని ప్రభుత్వం ఉద్యోగులను సంతృప్తి పరుస్తుందని తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఉద్యోగ సంఘాల్లో ఐక్యత రావాలని చెప్పడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. దీంతో పీఆర్సీ అమలు కోసం ప్రభుత్వం జాప్యం చేయడానికి కారణమేంటన్న చర్చ సాగుతోంది.

    ap Emplyoyees prc

    ప్రభుత్వ ఉద్యోగులకు ఎంత జీతం ఇవ్వాలి..? ఎంత పెంచాలి..? అనేది ‘పే రివిజన్ కమిషన్’ (పీఆర్ సీ) నిర్ణయిస్తుంది.ఐదేళ్లకోసారి ఈ కమిషన్ ఉద్యోగుల జీతాల్లో సవరింపులు చేస్తుంది. ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తమ ఉద్యోగుల జీతాలు పెంచుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు కమిషన్ చెప్పిన దానికంటే ఎక్కువే పెంచాయి. ఉద్యోగులకు సంబంధించిన నియామకాలు, ప్రభుత్వానికి నివేదికలు సమర్పించడం తదితర కార్యక్రమాలు నిర్వహించే పీఆర్ సీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1969లో ఏర్పాటయింది.

    సీఎం జగన్ పాదయాత్ర నిర్వహించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కలుస్తూ వచ్చారు. ఈ సమయంలో ఉద్యోగులు తమ గోడును వెల్లడించారు. తమకు పీఆర్సీ అమలు చేయాలని విన్నవించడంతో అప్పుడు జగన్ సరేనన్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడగానే పీఆర్సీపై ఉద్యోగుల్లో ఆశలు పెరిగాయి. అయితే రెండున్నరేళ్లు పూర్తయినా పీఆర్సీ ఫైలు ముందకు కదలకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో ఇటీవల ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. దీంతో ప్రభుత్వం జాయిట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తోంది.

    ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 11వ పీఆర్సీ ని అమలు చేయాల్సి ఉంది. అయితే 2018 మే 18న పీఆర్ సీ నివేదిక కోసం అశుతోష్ మిశ్రా ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో ఆయన జీవో నెం. 1451 జీవో జారీ చేశారు. అశోక్ మిశ్రా తన నివేదికను ఏడాదిలోగా సమర్పించాల్సి ఉండా అనేక కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 2020 అక్టోబర్ 5న ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అయితే ఏడాది గడిచినా ప్రభుత్వం ఈ విషయంపై ఎలా ప్రకటన చేయడం లేదు. ఈ నివేదిక గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పీఆర్సీ అమలు పై ఉద్యోగుల్లో నిరాశ పెరిగింది.

    పీఆర్సీ నివేదికను వెల్లడించడానికి జాయింట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తూన్నా అసలు విషయంపై ప్రభుత్వం స్పందించడం లేదు. అక్టోబర్ 29న జరిగిన సమావేశంలోనూ అదే జరిగింది. దీంతో మరోసారి ఈ శుక్రవారం మరోసారి జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు వాకౌట్ చేశారు. అయితే పీఆర్సీ అమలులో జాప్యం జరుగుతుందనే కారణంతో సీఎం జగన్ 2019 జూలై నుంచి మధ్యంతర భృతి 27 శాతం ఇస్తున్నారు.

    ఇదిలా ఉండగా ప్రభుత్వం నివేదిక ఇస్తామని వివాదం ఎందుకు చేస్తున్నారని సచివాలయ ఉద్యోగ సంఘా నాయకులు అన్నారు. దీంతో ఉద్యోగ సంఘాల్లో చీలిక మొదలైందా..? అన్న చర్చ మొదలైంది. దీంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు. పీఆర్సీ అమలు జరుగుతున్న వేళ ఇలా ఉద్యోగుల మధ్య విభేదాలు ఏర్పడితే నష్టపోతామని కొందరు ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు సచివాలయం సాక్షిగా ఉద్యోగ సంఘాల్లో చీలిక ఏర్పడడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని ఎన్నుకోవాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించారు.