Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డికి తగ్గిన ప్రాధాన్యం.. అమరావతికి దూరంగా కీలక నేత

Vijayasai Reddy: వైసీపీలో విజయసాయిరెడ్డికి తగ్గిన ప్రాధాన్యం.. అమరావతికి దూరంగా కీలక నేత

Vijayasai Reddy: వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రాధాన్యం తగ్గుతుందా? ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయా? పార్టీలో విభజించు పాలించు అన్న చందంగా వ్యవహరిస్తున్నారా? అవినీతి ఆరోపణలపై సీఎం గుర్రుగా ఉన్నరా? పార్టీ కంటే తన సొంత పనులను చక్కబెడుతున్నట్టు గుర్తించారా? ఆయనను సీఎం జగన్ పక్కన పడేశారా? పార్టీ వ్యవహారాలకు దూరం పెడుతున్నారా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. మంత్రివర్గ కూర్పు నుంచి అలకపాన్పు ఎక్కిన వారిని బుజ్జగించే వరకూ విజయసాయి రెడ్డి ఎక్కడా కనిపించలేదు. అసలు ఆ మాటే వినిపించలేదు.

Vijayasai Reddy
Vijayasai Reddy

అయితే దీని వెనుక పెద్ద కథ ఉన్నట్టు అధికార పార్టీలో ఒకరకమైన చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి వ్యవహార శైలితో పక్కన పెట్టారన్న వాదనతో పాటు సజ్జల రామక్రిష్ణారెడ్డి ప్రాధాన్యం పెరగడంతో విజయసాయి సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం జగన్, విజయసాయిరెడ్డిల మధ్య దూరం పెరిగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. గ‌త కొద్ది రోజులుగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి సీఎం జగన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఒకరకంగా ఏపీలో మంత్రుల మాట కంటే సజ్జల మాటే ఎక్కువగా చెల్లుబాటవుతుందనేలా పరిస్థితులున్నాయి. ఏపీలో ఉద్యోగుల సమ్మె, జీతాల పోరాటం సమయంలో మంత్రులకంటే సజ్జలే ఎక్కువగా మీడియా ముందుకొచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపి దానికి శుభం కార్డు పడేలా చేసింది కూడా ఆయనే.ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వేళ మరోసారి సజ్జల కీలకంగా వ్య‌వ‌హారించారు. త‌న వ‌ర్గానికి మంత్రి ప‌ద‌వులు రావ‌డానికి సజ్జల చాలా కీల‌కంగా వ్య‌వ‌హారించార‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఒక్క‌సారిగా విజ‌య‌సాయి రెడ్డి ప్రాధాన్యత త‌గ్గ‌డానికి, పార్టీలో, ప్రభుత్వంలో సజ్జల శక్తివంతమైన వ్యక్తిగా మారడానికి కారణాలు ఏమై ఉండొచ్చన్న చర్చ అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో జరుగుతోంది.

సజ్జలకు అగ్రతాంబూలం
మంత్రివర్గ విస్తరణ కసరత్తులో సీఎం జగన్ సజ్జలకు అగ్రతాంబూలం ఇచ్చారు. జిల్లాల్లో ఎవరెవరికి అవకాశం కల్పించాలి. వారి గుణగణాలు, పార్టీకి వారు అందించే సేవలు వంటి వివరాల సేకరణ బాధ్యత సజ్జలకే అప్పగించారు. సామాజిక సమతూకం, వచ్చే ఎన్నికలకు అనుగుణంగా కేబినెట్ కూర్పు బాధ్యతను సజ్జల చేతుల్లో పెట్టారు. అసలు సజ్జల సూచించిన ఎమ్మెల్యేలనే కేబినెట్ లోకి తీసుకున్నారన్న టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది. మంత్రి ప‌ద‌వుల విష‌యంలో సాయిరెడ్డి సూచించిన ఒక్క ఎమ్మెల్యేకు కూడా జ‌గ‌న్ పరిగణలోకి తీసుకోలేదన్నది మరోవాదనగా ఉంది. అంతెందుకు మంత్రి పదవి దక్కని అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతను కూడా సీఎం.. సజ్జలకే అప్పజెప్పారు. దీంతో గ‌త కొత్త కాలంలో ఏపీ ప్ర‌భుత్వంలో జ‌గ‌న్ త‌రువాత స్థానంలో స‌జ్జ‌ల ఉన్నారు అనే ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయింది.పార్టీలో తన మాటకు అంతగా ప్రాధాన్యం దక్కడం లేదనేది విజయసాయి రెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో విశాఖ వ్యవహారాలే కారణమన్న దుమారం రేగుతోంది.

Vijayasai Reddy
Vijayasai Reddy:

ఉత్తరాంధ్ర వ్యవహారాలను విజయసాయిరెడ్డిని నియమించిన నాటి నుంచే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. విపక్షం కంటే స్వపక్షం వారే సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. తన సొంత పనులకే విజయసాయి ప్రాధాన్యమివ్వడంతో పార్టీ దారి తప్పుతోందన్న నిఘా వర్గాల సమాచారం సీఎం జగన్ వద్ద ఉంది. అందుకే కొన్నాళ్లు ఆయన విశాఖకు దూరంగా ఉంచారు. తరువాత రోజుల్లో కొంత వెసులబాటు ఇవ్వడంతో మళ్లీ రాకపోకలు సాగించారు. ప్రస్తుతానికి మాత్రం సీఎం జగన్ విజయసాయి రెడ్డిని కాస్తా దూరంగానే పెట్టారని టాక్ నడుస్తోంది. అందుకే ఆయన అమరావతికి రాకుండా విశాఖపట్నం, హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారని.. లేదంటే ఢిల్లీలో ఉండిపోతున్నారని తెలుస్తోంది. గా మారారు. ఐతే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు తోడుగా నీడగా వ్యవహరించిన విజసాయిరెడ్డిని పట్టించుకోకపోవడానికి కారణాలేంటనేది మాత్రం కార్యకర్తలకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతోంది.

RELATED ARTICLES

Most Popular