https://oktelugu.com/

డిసెంబర్ 9..ఈ రోజును తెలంగాణ ప్రజలు ఎలా మర్చిపోతారు..?

డిసెంబర్ 9.. ఈ తేదీని ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం సాగి చివరికి ఈరోజునే మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన చేశారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో చివరికి కేసీఆర్ ప్రాణం మీదకు తెచ్చుకొన్న తరువాత ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర […]

Written By:
  • NARESH
  • , Updated On : December 10, 2020 1:07 pm
    Follow us on

    Telangana Memorable day

    డిసెంబర్ 9.. ఈ తేదీని ఎవరు గుర్తు పెట్టుకోకపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఉద్యమం సాగి చివరికి ఈరోజునే మొట్టమొదటి సారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ప్రకటన చేశారు అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అన్నట్లుగా సాగిన తెలంగాణ ఉద్యమంలో చివరికి కేసీఆర్ ప్రాణం మీదకు తెచ్చుకొన్న తరువాత ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సరేనంది.

    Also Read: ‘నాగార్జున సాగర్’ పై నజర్..!

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న ఉద్యమం ఈనాటిది కాదు. 1969 నుంచే తెలంగాణ ప్రజలు తమ సొంత గడ్డ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. కానీ 2001లో ప్రొఫెసర్ జయశంకర్ సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా పనిచేశారు. అంతకుముందు ఆయన టీడీపీలో ఉన్నసమయంలో తెలంగాణ ప్రజలపై ఉన్న వివక్షను కళ్లారా చూశారు. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పట్టుబట్టారు. ఇందుకు ఒక రాజకీయ పార్టీ అవసరమని గుర్తించి 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు.

    పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నికల్లో పోటీ చేసినా ప్రజల్లోకి మాత్రం టీఆర్ఎస్ వెళ్లలేకపోయింది. దీంతో ఉధ్రుత పోరాటం ద్వారానే తెలంగాణ సాధ్యమని గ్రహించిన కేసీఆర్ 2009 నవంబర్ 29న కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు వద్ద నిరాహార దీక్షను చేపట్టారు. మొదటి రోజే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ వాదం ప్రజల్లోకి వెళ్లింది. ఆ తరువాత కేసీఆర్ ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించినా దీక్షను కొనసాగించారు. అయితే డిసెంబర్ 1న కేసీఆర్ ‘నేను ఉన్నా లేకున్నా.. తెలంగాణ ఉద్యమం కొనసాగించాలి’ అన్న వ్యాఖ్యలతో ప్రజల్లో మరింత చలనం మొదలైంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ కు మద్దతుగా రోడ్లపైకి వచ్చి రకరకాల పద్ధతిలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

    Also Read: తెలంగాణలో నడిపించే నాయకుడెవరు..?

    అప్పటి కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్ తెలంగాణ ప్రజల ఆందోళనలను నిలువరించలేకపోయింది. ఒక దశలో తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులపై తమకు తెలంగాణ తెచ్చుకోవడం అవసరం లేదా అంటూ దాడులు చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలపక తప్పలేదు. రోజురోజుకు పరిస్థితి అదుపు తప్పడంతో కేంద్రంలోని యూపీఏ సర్కారు అప్రమత్తమైంది. మరోవైపు కేసీఆర్ దీక్ష కొనసాగిస్తుండడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

    ఈ నేపథ్యంలో డిసెంబర్ 9న పార్లమెంట్ లో తెలంగాణ ఉద్యమంపై తీవ్రంగా చర్చ సాగింది. తెలంగాణ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్న పార్టీల నాయకులు సైతం సూచించారు. చివరకు డిసెంబర్ 9న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఆరోజు సోనియా జన్మదిన వేడుకల సందర్భంగా ఈ ప్రకటన చేయడం విశేషం. అప్పటి వరకు పట్టువదలని విక్రమార్కుడిలా ఉన్న కేసీఆర్ చివరకు సన్నిహితుల మధ్య దీక్షను విరమించారు. ఇలా తెలంగాణ ప్రజల మదిలో డిసెంబర్ 9వ రోజు చిరస్థాయిగా నిలిచింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    డిసెంబర్ 9.. తెలంగాణ కు ఇది స్పెషల్ డే | December 9th - A Mile Stone to Telangana Formation