AP Secretariat: అప్పులున్న సంసారాన్ని లాగడమే చాలా కష్టం. అలాంటిది రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపడం ఇంకా కష్టం. ప్రస్తుతం ఏపీ అప్పులు ఊబిలో కూరుకుపోయింది. పాత అప్పులను తీర్చడమేమో గానీ.. కొత్త అప్పులు చేయకుండా ఉంటే చాలు అన్నట్టు తయారైంది. పరిస్థితి. అయితే అప్పులోల్లు ఏడాదికోసారి ఇంటికొచ్చి వసూలు చేసుకుని పోతారు కదా. ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి.
ఎందుకంటే మార్చితో ఆర్థిక సంవత్సరం పూర్తయిపోతుంది కాబట్టి.. అప్పులోల్లు వచ్చి వసూలు చేసుకోవాలనుకుంటున్నారంట. ఎందుకంటే టైమ్‌కు చెల్లింపులు చేయట్లేదు జగన్ ప్రభుత్వం. గతంలో తీసుకున్న రుణాలకు ఈఎమ్ ఐలు కూడా కట్టట్లేదు వైసీసీ సర్కార్. దీంతో కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు రేపో మాపో సచివాలయానికి రావడాలని డిసైడ్ అయ్యారంట.
కేంద్ర సంస్థలైన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, హడ్కో లాంటి సంస్థల నుంచి రాష్ట్రానికి చెందిన పలు కార్పొరేషన్ సంస్థలు అప్పులు తీసుకున్నాయి. కానీ వాటిని వాయిదాల్లో చెల్లించడం లేదు. దీంతో ఆయా కేంద్ర సంస్థలకు చెందిన ప్రతినిధులు సచివాలయానికి రావడానికి రెడీ అవుతున్నారు. సచివాలయానికి వచ్చి అప్పులు వసూలు చేసుకోవాలని అనుకుంటున్నారు.
అదే జరిగితే జగన్ ప్రభుత్వం పరువు మొత్తం పోవడం ఖాయం. ఎంత సేపు అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తప్ప.. వాటిని చెల్లించడంలో మాత్రం శ్రద్ధ చూపట్లేదు జగన్. మరి ఎవరైనా ఎంత కాలం ఊరుకుంటారు చెప్పండి.. అందుకే యాక్షన్ షురూ చేస్తున్నారు. మోయలేనన్ని అప్పులు చేస్తున్న జగన్ సర్కార్.. వాటిని చెల్లించగలిగే ప్రయత్నాలు మాత్రం చేయట్లేదు. ఎకానమీ పడిపోతే సంక్షోభ పరిస్థితులు తప్పవని ఇప్పటికే చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ అప్పుల పరిస్థితిపై కేంద్రం కూడా ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తోంది. అప్పులు తీసుకోవడంలో ఉన్న శ్రద్ధ.. వాటిని తిరిగి చెల్లించడంలో ఎందుకు లేదంటూ కేంద్రం పలుమార్లు పార్లమెంట్ సాక్షిగా హెచ్చరిస్తోంది. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టు జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీంతో అప్పుల ఊబిలోంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితులు కనిపంచట్లేదు.