Dasoju Sravan: కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ.. రాజగోపాల్ రెడ్డి బాటలో దాసోజు శ్రావణ్

Dasoju Sravan: అనుకున్నట్టే అయ్యింది. కాంగ్రెస్ నుంచి ఒక్కో ‘చేయి’ జారిపోతోంది. నిన్నటికి నిన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాటలో దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ కు బైబై చెప్పారు. కాంగ్రెస్ వాదిగా.. వాయిస్ గా.. అధికార ప్రతినిధిగా టీవీల్లో, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థులను చీల్చిచెండాడే దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అంత యాక్టివిస్ట్ ఎందుకు రాజీనామా చేశాడా? […]

Written By: NARESH, Updated On : August 5, 2022 3:02 pm
Follow us on

Dasoju Sravan: అనుకున్నట్టే అయ్యింది. కాంగ్రెస్ నుంచి ఒక్కో ‘చేయి’ జారిపోతోంది. నిన్నటికి నిన్న మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు అదే బాటలో దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ కు బైబై చెప్పారు. కాంగ్రెస్ వాదిగా.. వాయిస్ గా.. అధికార ప్రతినిధిగా టీవీల్లో, ప్రెస్ మీట్లలో ప్రత్యర్థులను చీల్చిచెండాడే దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. అంత యాక్టివిస్ట్ ఎందుకు రాజీనామా చేశాడా? అని అందరూ ఆరాతీస్తున్నారు.

నిజానికి దాసోజు శ్రవణ్ మొదటి టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా మంచి వాయిస్ వినిపించారు.అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు కేసీఆర్ టికెట్ నిరాకరించడంతో మనస్థాపం చెందిన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.

ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేసింది. దాసోజు శ్రవణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించడం ఖాయంగా మారింది. పీజేఆర్ కూతురు, కార్పొరేటర్ విజయారెడ్డి ఇటీవల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. అధికార పార్టీ నుంచి వచ్చిన ఆమెకు ఖైరాతాబాద్ సీటు ఇస్తామని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది.

ఈక్రమంలోనే కాంగ్రెస్ లో ఇంత యాక్టివ్ గా ఉంటున్న తనకు ఇలా ఎమ్మెల్యే సీటు ఇవ్వరని తెలిసి దాసోజు శ్రవణ్ రాజీనామా చేశారు. ఇంత పనిచేసినా విజయారెడ్డిని తనకు పోటీగా తీసుకురావడం.. పైగా సీటు హామీ కాంగ్రెస్ లో లభించకపోవడంతో విసిగి వేసారిన దాసోజు శ్రవణ్ ఇక కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

ఇప్పటికే టీఆర్ఎస్ , ఇప్పుడు కాంగ్రెస్ ను వీడిన దాసోజు శ్రవణ్ కు ఇప్పుడు బీజేపీ తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. మొన్నటివరకూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బీజేపీని తిట్టిన దాసోజు ఇప్పుడు ఆ పార్టీలో చేరుతారా? ఆయన అడుగులు ఎటు వైపు పడుతాయన్నది వేచిచూడాలి.