తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం కింద ఎస్సీ కుటుంబాలకు రూ.10లక్షలు ఇచ్చేపథకాన్ని ప్రయోగాత్మకంగా ఈనెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పూర్తి స్థాయిలో అధికారులు దీనికి సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
దళిత బంధు పథకం కింద పదిరోజుల్లోనే ప్రతిఫలం పొందేలా యూనిట్లకు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే అమలు చేస్తున్న వాటిలో రెండు మూడు యూనిట్లను కలిపి ఒక పెద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
ఇక వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణకేబినెట్ నిర్ణయం తీసుకుంది. 57 ఏళ్ల వారికి తక్షణమే పింఛన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వృద్ధాప్య పించణ్ల అర్హత వయసు తగ్గింపు కారణంగా రాష్ట్రంలో మరో 6.62 లక్షల మందికి కొత్తగా పింఛన్లు ఇవ్వాల్సి ఉంటుందని.. తెలంగాణలో మొత్తం పింఛన్ల సంఖ్య 58 లక్షలకు చేరనుందని అధికారులు తెలిపారు.
ఇక కుటుంబంలో ఒక్కరికే పింఛన్ కొనసాగించాలని భర్త చనిపోతే భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని.. బదిలీ పద్దతి ఉండాలని సూచించారు.