https://oktelugu.com/

రాయలసీమ ఎత్తిపోతలకు లైన్‌ క్లియర్‌‌

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్‌ సర్కార్‌‌ ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇన్నాళ్లు ఈ నిర్మాణానికి కేంద్ర జలసంఘం నిర్ణయం అవసరం ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని నిర్మాణానికి తమ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదివరకే అన్ని రకాల అనుమతులను పొందిన పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామంటూ ప్రభుత్వం వినిపిస్తూ వస్తున్న […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 27, 2020 / 11:03 AM IST
    Follow us on


    రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్‌ సర్కార్‌‌ ఎంతగానో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇన్నాళ్లు ఈ నిర్మాణానికి కేంద్ర జలసంఘం నిర్ణయం అవసరం ఉండేది. కానీ.. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగాయి. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) తన నిర్ణయాన్ని వెల్లడించింది. దీని నిర్మాణానికి తమ అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇదివరకే అన్ని రకాల అనుమతులను పొందిన పోతిరెడ్డిపాడు విస్తరణలో భాగంగా.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామంటూ ప్రభుత్వం వినిపిస్తూ వస్తున్న వాదనలతో ఏకీభవించింది.

    Also Read: తెలంగాణ ప్రభుత్వం ఎల్‌ఆర్‌‌ఎస్‌ సంగతి ఏం చేయబోతోంది..?

    అంతేకాదు.. అదనంగా ఎలాంటి సాంకేతికపరమైన అనుమతులను మంజూరు చేయాల్సిన అవసరం లేదని కూడా వెల్లడించింది. దీంతో ఈ ఎత్తిపోత నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లయింది. కేంద్ర జలసంఘం తాజాగా నిర్ణయంతో ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రారంభ పనులను ముగించుకుంది. కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడానికి బిడ్డింగుల ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది.

    ఈ పథకం నిర్మాణానికి ఇదివరకే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు ఇచ్చాయి. తాజాగా- సీడబ్ల్యూసీ కూడా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇక కృష్ణా బోర్డు అనుమతిని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం అదొక్కటే మిగిలి ఉంది. కృష్ణా నదీ జలాల్లో తమ వాటాగా దక్కిన నీటిని వినియోగించుకోవడం ద్వారా రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంతోపాటు నెల్లూరు జిల్లాకు సాగు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకం నిర్మించడానికి ప్రణాళికలను రూపొందించుకుంది.

    Also Read: భారత్‌లో జనవరి నుంచే వ్యాక్సినేషన్‌

    తెలంగాణ–-ఏపీ మధ్య అంత‌ర్రాష్ట్ర వివాదంగా మారింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర జలసంఘం, జల్‌శక్తి మంత్రిత్వ శాఖ వద్ద తమ వాదనలను వినిపించాయి. ఇప్పటికే అన్నిరకాల అనుమతులను తీసుకున్న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విస్తరణలో భాగంగా దీన్ని చేపట్టబోతోన్నట్లు ఏపీ ప్రభుత్వం వాదించింది. కొత్తగా తాము కృష్ణా జలాలపై ఎలాంటి ప్రాజెక్టును నిర్మించట్లేదని పేర్కొంది. వరద జలాలను మళ్లించడానికి పోతిరెడ్డి పాడును ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిందని, దీన్ని మరింత విస్తరించాలనేదే తమ ప్రణాళికగా చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో నిర్మాణంలో స్పీడ్‌ పెంచేందుకు జగన్‌ సర్కార్ సిద్ధపడింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్