
స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆదిలోనే అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సీనియర్ ఎన్టీఆర్ కాంగ్రెస్ కు చుక్కలు చూపించారు. అయితే ఊహించని పరిణామాల వల్ల చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వెళ్లింది. ఆ తరువాత తెలుగుదేశం 1999లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
Also Read : అచ్చెన్నాయుడికి జ్ఞానోదయం కలిగిందా..?
అయితే 2004,2009లో చంద్రబాబు పప్పులుడకలేదు. చంద్రబాబు పాలనలో పింఛన్ల అమలు, పథకాల అమలును చూసిన ప్రజలు ఆ పార్టీని అధికారంలోకి తెప్పించే ఆలోచన కూడా చేయలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ, తెలంగాణ విడిపోయిన సమయానికి కూడా బాబు రెండు కళ్ల సిద్దాంతం గురించి తెలిసిన ప్రజలు ఆయనను నమ్మలేదు. అయితే జగన్ తో పోలిస్తే చంద్రబాబు అనుభవజ్ఞుడు కావడం ఆయనకు ప్లస్ అయింది.
అదే సమయంలో బీజేపీ, జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి ప్లస్ అయింది. దీంతో సులువుగానే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐతే బాబు ఐదేళ్ల పాలనను చూసిన ప్రజానికం చంద్రబాబును నమ్మి తప్పు చేశామని గ్రహించారు. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న టీడీపీకి చివరకు 23 మంది ఎమ్మెల్యేలే మిగిలారు.
ప్రస్తుతం టీడీపీ పార్టీ పరిస్థితి ఏం బాగోలేదు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. లోకేశ్ ను పార్టీ నేతలు నమ్మే పరిస్థితిలో లేరు. ఫలితంగా టీడీపీ అంతకంతకూ బలహీనపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించడమే సరైన నిర్ణయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పార్టీ బలపడాలంటే చంద్రబాబు ఇంతకు మించిన ఆప్షన్ లేదు. మరి విశ్లేషకులు సూచిస్తున్న ఈ సూచనను బట్టే చంద్రబాబు ముందుకెళతాడో లేక తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అంటూ లోకేశ్ కే బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమవుతారో చూడాలి.
Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!