https://oktelugu.com/

Jagan Davos Tour: దావోస్ కు కుబేరులు వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ వెళ్లాడా?

Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన విమర్శలకు దారితీస్తోంది. ఆయన దావోస్ అంటూ లండన్ వెళ్లడంతో టీడీపీ నేతలు, మీడియా తీవ్ర విమర్శలు గుప్పించారు. దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పి కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ వెళ్లారని మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు విరుచుకుపడ్డారు. అది ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ అని అయ్య‌న్న‌ ఆరోపించారు. దీని ఖర్చు గంటకు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 22, 2022 / 09:48 AM IST
    Follow us on

    Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటన విమర్శలకు దారితీస్తోంది. ఆయన దావోస్ అంటూ లండన్ వెళ్లడంతో టీడీపీ నేతలు, మీడియా తీవ్ర విమర్శలు గుప్పించారు. దావోస్ వెళ్తున్నాన‌ని చెప్పి కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ వెళ్లారని మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు విరుచుకుపడ్డారు. అది ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ అని అయ్య‌న్న‌ ఆరోపించారు. దీని ఖర్చు గంటకు రూ.12 లక్షలు అని వ్యాఖ్యానించారు. లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి ? అంటూ ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు. చిదంబర రహస్యం ఏంటో? అని అయ్య‌న్న ప్ర‌శ్నించారు.

    వ‌రల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ దావోస్ వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న లండ‌న్ వెళ్లార‌ని టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడు ఆరోపించారు. అది కూడా అత్యంత ఖర్చు ఉండే విమానంలో వెళ్లార‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ”జగన్ రెడ్డి దావోస్ అని బయలుదేరిన స్పెషల్ ఫ్లైట్ ఎంబ్రేయర్ లినీయ‌జ్‌ 1000. ప్రపంచ టాప్ 50 కుబేరులు మాత్రమే వాడే స్పెషల్ ఫ్లైట్ ఇది. దీని ఖర్చు, గంటకు 14,500 డాలర్లు. అంటే గంటకు రూ.12 లక్షలు. జగన్ రెడ్డి దావోస్ అని చెప్పి, లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్ లో దిగారని తెలుస్తోంది.

    లండన్ కు దాదాపుగా 13-14 గంటల సమయం. దాదాపుగా కోటిన్నర కేవలం ఫ్లైట్ ఖర్చు. ఇక లండన్ లోని లుటన్ ఎయిర్ పోర్ట్, కేవలం ప్రైవేట్ ఎయిర్ పోర్ట్. ధనవంతులు మాత్రమే దిగే చోటు. ఇక్కడ పార్కింగ్ ఫీజ్, ప్రపంచ కుబేరులు మాత్రమే భరించగలరు. లావిష్ ఫ్లైట్ లో, రాయల్ గా, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి వెళ్తున్నాడు జగన్ రెడ్డి. మన పొట్టలు కొట్టి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక జగన్ రెడ్డి, సీబీఐ కోర్ట్ లో, తాను దావోస్ వెళ్తున్నా అని చెప్పి, లండన్ వరకు ఎందుకు వెళ్లారో మరి? చిదంబర రహస్యం ఏంటో ? మీ ఎంపీ గారు చెప్పింది, నిజమేనా అయితే?” అని అయ్య‌న్న పాత్రుడు ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

    *దీనిపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పత్రికా ప్రకటన
    –ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారింది. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోంది. కనీస విలువలను పాటించాలన్న స్పృహ కోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. వీరినుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ ముప్పు మరింత పెరిగింది.
    – ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన మీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజు కూడా దిగజారిపోతున్నారు.
    – గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమానప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీని మీద పనిగట్టుకుని ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుంది. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలన్ని వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప మాది కాదు.
    – ముఖ్యమంత్రి పర్యటన రహస్యమేమీ కాదు. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు.
    – నిన్న గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగింది.
    – దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉంది. ఈలోగా జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాలనుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు.
    – ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు– లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ముఖ్యమంత్రిగారికి బస ఏర్పాటు చేశారు.
    – తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ… పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. – నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రిమీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారింది. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుంది. ముఖ్యమంత్రిగారు కాసేపట్లో దావోస్‌ చేరుకుంటారు.