Maldives vs India : ఆ అండ చూసుకునే.. మన మీద మాల్దీవుల అక్కసు

మొత్తానికి మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లక్షద్వీప్ పట్ల వరంగా మారాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Written By: NARESH, Updated On : January 8, 2024 5:56 pm
Follow us on

Maldives vs India : మన దేశం మీద ఏవైనా మాటలు మాట్లాడాలంటే బలమైన ఇస్లాం దేశాలే భయపడుతుంటాయి..ఆ పాక్ ను వదిలేయండి. అదో ఉగ్రవాద దేశం. కరడు గట్టిన తాళిబన్లు కూడా మన దేశ ఔన్నత్యాన్ని పొగుడుతుంటారు. పాక్ సింధ్ లోయ ప్రజలు జేజేలు పలుకుతుంటారు. అయితే అలాంటి మన దేశాన్ని మాల్దీవుల మంత్రులు ఎలా కించపరిచారు? ఎక్స్ లో మురికి దేశమని, ఆవు పేడ అని, పర్యాటకం చేతకాదని ఎలా అన్నారు? ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నవారు ఒక్కసారిగా ఎందుకు ఆ స్థాయి లో విషం చిమ్మారు? మన దేశం మొత్తం ఒకేసారి స్పందించేసరికి వెనకడుగు వేశారు.. అయితే ఈ స్థాయిలో ప్రతిస్పందనను వారు ఊహించి ఉండలేదా?

భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రభుత్వ మంత్రుల వ్యవహార శైలి ప్రస్తుత ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మన దేశ నెటిజన్లు ఆ దేశ మంత్రులను ఒక ఆట ఆడుకుంటున్నారు. బాయ్ కాట్ మాల్దీవులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున సాగిస్తున్నారు. అంతే కాదు ఆ దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో సందర్శించబోమని ఆన్ లైన్ వేదికగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు ఆ దేశం వెనుక ఉన్నది ఎవరనే ప్రశ్న తలెత్తినప్పుడు.. ఆసక్తికరమైన సమాధానం లభిస్తున్నది. భారత్ నుంచి పర్యాటకంగా భారీగానే ఆదాయం వస్తున్నప్పటికీ మాల్దీవులు డ్రాగన్ స్నేహాన్ని కోరుకుంటున్నది. మహమ్మద్ మాయిజ్జు మాల్దీవుల కు అధ్యక్షుడయిన తర్వాత భారత్ పై విషాన్ని చిమ్మడం ప్రారంభించాడు. అంతేకాదు భారతదేశంతో సంబంధాలను చాలా వరకు ధ్వంసం చేశాడు. భారతదేశంలో కుదుర్చుకున్న అనేక రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యాడు. అంతేకాదు డ్రాగన్ దేశానికి దగ్గర కావడానికి పావులు కదుపుతున్నాడు. వీటికి బలం చేకూర్చే విధంగా సోమవారం ఆ దేశంలో మాయిజ్జు పర్యటిస్తున్నాడు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను కలిశాడు. దీనికంటే ముందే మాల్దీవులకు చెందిన మంత్రులు మన దేశం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం విశేషం.

అయితే వారు ఆ వ్యాఖ్యలను లక్షద్వీప్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించినందువల్లే చేశారని చెబుతున్నప్పటికీ.. దాని వెనుక అసలు కారణం ఆ దేశం చైనాతో మైత్రిని కోరుకోవడమే అని తేటతెల్లమవుతున్నది. ఎందుకంటే భారతదేశంతో సఖ్యతగా ఉంటే చైనాకు దగ్గరవ్వడం అసాధ్యం కాబట్టి.. అందుకే మాల్దీవుల ప్రభుత్వం ఇలాంటి దుస్సాహాసానికి ఒడి కట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మన దేశాన్ని ఇజ్రాయిల్ పప్పెట్ గా, ఆవు పేడతో పోల్చడం వెనుక కారణం అదే అని వారు ఉదహరిస్తున్నారు. ఇప్పటికే చైనా ఆర్థికపరంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. సముద్ర రవాణా ద్వారా గణనీయమైన ఆదాయాన్ని గడించాలని చూస్తోంది. పసిఫిక్ సముద్రంపై పట్టు పెంచుకోవాలని భావిస్తున్నది. అందుకే మాల్దీవులకు ఎర వేసినట్టు.. అందులో ఆ దేశ ప్రధాని చిక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆసియా పరిధిలో చైనాతో స్నేహం చేసిన ప్రతీ దేశం కూడా సర్వనాశనమైంది.. అందులో త్వరలో మాల్దీవులు కూడా చేరబోతుందని.. ప్రధానమంత్రి లక్ష్య ద్వీప్ పర్యటన తర్వాత ఆ ప్రాంతంలో ఒక్కసారిగా మారిపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పర్యాటకంగా మన దేశానికి కూడా భారీగా ఆదాయం లభిస్తుందని వారు చెబుతున్నారు.. మొత్తానికి మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లక్షద్వీప్ పట్ల వరంగా మారాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.