https://oktelugu.com/

మద్యం లభించక నేరాలు పెరిగిపోతున్నాయా!

ఎక్కడైనా నేరాలు, ఘర్షణలు పెరగడానికి మద్యంను ప్రధాన కారణంగా చెప్పుకొంటుంటాము. ముఖ్యంగా గృహహింస, లైంగిక వేధింపులకు దీనినే కారణంగా చూపుతుంటాము. కానీ లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలు సహితం స్థంభించి పోవడంతో దేశంలో నేరాలు పెరుగుతున్నాయని అంటూ వింతయిన వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు మద్యం అమ్మకందారుల. లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా గత మూడు వారాలుగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన్నట్లు దాదాపు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక విధంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 11:49 AM IST
    Follow us on


    ఎక్కడైనా నేరాలు, ఘర్షణలు పెరగడానికి మద్యంను ప్రధాన కారణంగా చెప్పుకొంటుంటాము. ముఖ్యంగా గృహహింస, లైంగిక వేధింపులకు దీనినే కారణంగా చూపుతుంటాము. కానీ లాక్‌ డౌన్‌ సమయంలో మద్యం అమ్మకాలు సహితం స్థంభించి పోవడంతో దేశంలో నేరాలు పెరుగుతున్నాయని అంటూ వింతయిన వాదనను తెరపైకి తీసుకు వస్తున్నారు మద్యం అమ్మకందారుల.

    లాక్ డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా గత మూడు వారాలుగా నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిన్నట్లు దాదాపు అన్ని రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక విధంగా సామాజికంగా ప్రశాంతతకు కూడా కారణమవుతుంది. అయితే అక్కడక్కడా మూసి ఉన్న మద్యం షాపులపై కొద్దిపాటి దాడులు జరిగాయి. మద్యం కోసం దోపిడీలు కూడా జరిగాయి.

    దానితో అత్యవసర వస్తువుల జాబితాలు మద్యంను కూడా తీసుకు వచ్చి, దేశంలో మద్యం అమ్మకాలకు లాక్ డౌన్ సమయంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ అఖిల భారత బ్రూవరీస్‌ సంఘం (ఎఐబిఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. మద్యం షోపలపై చెదురుమదురుగా జరుగుతున్న దాడుల కారణంగా దేశంలో అక్రమం మద్యం అమ్మకాలు పెరిగిపోతున్నాయని అంటూ వీరు పేర్కొన్నారు.

    అందుకనే ఆహారం మాదిరిగానే అత్యవసర సేవల్లోకి మద్యాన్ని కూడా తీసుకురావాలని కోరుతున్నారు. పైగా తమ వ్యాపారాన్ని లాక్ డౌన్ సమయంలో పెంచుకునేందుకు ఇంటి వద్దనే కొనుగోలు దారులకు మద్యం సరఫరా చేస్తామని కూడా వీరు ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు కూడా నిధులు సమకూరుతాయి గదా అంటూ ప్రభుత్వాలకు ఆశలు కలిపిస్తున్నాయి.

    కరోనా కారణంగా ఒక్క ఏప్రిల్‌, మే నెల్లోనే రూ 16,000 కోట్ల వరకు తమకు తెలంగాణలోనే నష్టం వాటిల్లే పరిస్థితి ఉరదని, మిగిలిన నెలల్లో కూడా పరిస్థితి నిరాశాజకనంగానే ఉంటుందని వీరు పేర్కొన్నారు.

    దేశంలోని 86 ఉత్పత్తి సంస్థల ద్వారా దాదాపు రూ 60,000 కోట్ల విలువైన బీరు ఉత్పత్తి జరుగుతోరదని, అమ్మకాల ద్వారా వచ్చే పన్నుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ 36,000 కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాలున్నాయని ఎఐబిఎ పేర్కొన్నది.

    ప్రస్తుతం బీర్ల తయారీకి బార్లీ, బియ్యం, గోధుమ, చక్కెర వంటివి రైతుల నుంచి సమీకరించుకొంటున్నారు. తమ వ్యాపారం మూతబడితే పరోక్షంగా రైతులకు కూడా దెబ్బె అని వారిస్తున్నారు.