https://oktelugu.com/

CPI Narayana: చిరంజీవిపై నోరుజారినందుకు రెండు చేతులెత్తి దండెం పెట్టిన సీపీఐ నారాయణ

CPI Narayana: కమ్యూనిస్టులు అంటేనే ఆవేశపరులు.. ముందూ వెనుకా చూసుకోకుండా యుద్ధానికి వెళతారు. ఒకప్పుడు ప్రజా సమస్యలపై కొట్లాడడంలో కమ్యూనిస్టులను మించిన వారు లేరు. కానీ తదనంతర కాలంలో రాజకీయంగా ప్రజల నాడి తెలుసుకోవడం.. ప్రజలకు సేవ చేయడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. నాయకత్వ లోపాలు.. భ్రష్టుపట్టిన పాత చింతకాయపచ్చడి విధానాలను అవలంభించి ప్రజలకు దూరమయ్యారు. అప్డేట్ కాకుండా ఇంకా అదే పరుష డైలాగులు, పదునైన విమర్శలతో నోరుపారేసుకోవడం కమ్యూనిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి కమ్యూనిస్టు యోధుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 20, 2022 / 12:49 PM IST
    Follow us on

    CPI Narayana: కమ్యూనిస్టులు అంటేనే ఆవేశపరులు.. ముందూ వెనుకా చూసుకోకుండా యుద్ధానికి వెళతారు. ఒకప్పుడు ప్రజా సమస్యలపై కొట్లాడడంలో కమ్యూనిస్టులను మించిన వారు లేరు. కానీ తదనంతర కాలంలో రాజకీయంగా ప్రజల నాడి తెలుసుకోవడం.. ప్రజలకు సేవ చేయడంలో కమ్యూనిస్టులు విఫలమయ్యారు. నాయకత్వ లోపాలు.. భ్రష్టుపట్టిన పాత చింతకాయపచ్చడి విధానాలను అవలంభించి ప్రజలకు దూరమయ్యారు. అప్డేట్ కాకుండా ఇంకా అదే పరుష డైలాగులు, పదునైన విమర్శలతో నోరుపారేసుకోవడం కమ్యూనిస్టులకు వెన్నతో పెట్టిన విద్య.

    అలాంటి కమ్యూనిస్టు యోధుడు సీపీఐ నారాయణ నోరు తెరిస్తే చాలు బూతులు వస్తాయి. ఆయన ‘బిగ్ బాస్ ’ హౌస్ నే ‘బ్రోతల్ హౌస్’ అంటూ నోరుపారేసుకున్న పెద్ద మనిషి. ఆ షోను నడిపిస్తున్న హోస్ట్ హీరో నాగార్జునను అయితే అనరాని మాటలు అన్నారు. కౌంటర్లు రానంతవరకే ఇలాంటి నారాయణ వంటి నేతల మాటలు చెల్లుబాటు అవుతాయి. అయితే విశ్వసనీయత లేని ఈ నేతల మాటలకు ధీటుగా ప్రత్యర్థులు దండెత్తితే ఇలా ‘నారాయణ’ దండం పెట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. తిరుపతి వెంకన్న సాక్షిగా నోరుపారేసుకున్న నారాయణ ఇప్పుడు చెంపలేసుకొని తప్పైపోయిందంటూ నన్ను వదిలేయండి మహా ప్రభో అని మెగా ఫ్యాన్స్ ను కోరుతున్నాడు.

    సీపీఐ నారాయణ తప్పు తెలుసుకున్నారు. రెండు చెంపలు వేసుకున్నారు. చేతులెత్తి మరీ మెగాఫ్యాన్స్ కు దండం పెట్టారు. చిరంజీవిపై నోరు జారినందుకు పశ్చాత్తాపపడ్డారు. చిరంజీవిపై మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. నన్ను ఇక వదిలేయండి మహాప్రభో అంటూ వేడుకున్నారు.

    సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు రావడాన్ని తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడని కామెంట్స్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణను తీసుకొచ్చి ఉంటే బాగుండేదని.. ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని తీసుకెళ్లడమేంటని ప్రశ్నించారు. ఇక పవన్ కళ్యాణ్ పై నోరుపారేసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓ ల్యాండ్ మైన్ లాంటివాడని.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదంటూ సెటైర్లు వేశారు.

    పవన్ కళ్యాణ్, చిరంజీవిపై నారాయణ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. నిస్వార్థంగా ప్రజాసేవ చేసే ఇద్దరిపై నారాయణ దారుణ కామెంట్స్ చేయడంపై జనసైనికులు భగ్గుమన్నారు. రెండు రోజులుగా నారాయణను మీడియాలో, సోషల్ మీడియాలో, ఇంటా బయటా అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

    దీంతో తప్పు తెలుసుకున్న నారాయణ లెంపలేసుకున్నారు. అందరిపై ఇష్టానుసారంగా తిడితే ప్రతిస్పందనలు రాలేదు. కానీ చిరు, పవన్ లపై అంటే మాత్రం తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇకనైనా నారాయణ తిట్టే ముందు కాస్త నోరు కంట్రోల్ పెట్టుకొని తిడితే బాగుంటుందని జనసైనికులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.
    Recommended Videos