https://oktelugu.com/

టీడీపీ కార్యాలయానికి కొవిడ్ నోటీసులు

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కొవిడ్‌ నోటీసులు అధికారులు అందజేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేయగా టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేయడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ […]

Written By: , Updated On : May 27, 2020 / 08:03 PM IST
Follow us on


గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి కొవిడ్‌ నోటీసులు అధికారులు అందజేశారు. టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళగిరి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేయగా టీడీపీ కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసులు అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు జారీ చేయడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు.

మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టింది. ఈ అంశంపై అధికారులకు పిర్యాదు చేశారా అని పిటీషనర్ తరుపు న్యాయవాదిని ప్రశ్నించింది. గతంలో ఎటువంటి పిర్యాదులు లేకుండానే ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇందుకు సంభందించిన కేసు విచారణ గురువారం విచారణ ఉందని, వాటితో కలిపి విచారణ చేపడతామని హైకోర్టు ఆదేశించింది.