Covid-Dengue cases: తెలంగాణలో కొవిడ్ ప్రభావం పెరుగుతోంది. ప్రస్తుతం కోవిడెంగ్యూ వ్యాధి తీవ్ర రూపం దాల్చుతోంది. కొవిడ్ డెంగ్యూ కలిస్తేనే కోవిడెంగ్యూగా చెబుతున్నారు. దీంతో డెంగ్యూ సోకిన వ్యక్తికి కోవిడ్ కూడా వస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోవిడ్ రోగికి డెంగ్యూ సోకినప్పుడు కోవిడెంగ్యూగా వైద్యులు భావిస్తున్నారు. దీంతో రోగికి ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని సిండమిక్ వ్యాధిగా పిలుస్తారు. ప్రస్తుతం తెలంగాణలో దీని ప్రభావంతో చాలా మంది బాధితులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

గత మూడు నెలల్లో లేబరేటరీలో 1700 కేసులు నమోదైనట్లు వైద్యులు చెబుతున్నారు. ఇందులో 47 కోవిడెంగ్యూ కేసులని తెలుస్తోంది. దీంతో రోగులకు యాంటీవైరల్ చికిత్స అందజేస్తున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ సంరక్షణ తప్పనిసరని చెబుతున్నారు. రక్తంలో మార్పిడికి అనుబంధంగా ప్లేట్ లెట్ ట్రాన్స్ ఫ్యూజన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యాధి సోకితే చర్మంపై మచ్చలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చలి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిండమిక్ వ్యాధి సోకిన వారికి వైద్య చికిత్స అత్యవసరమని చెబుతున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: పిల్లలకూ కరోనా ‘ఒమిక్రాన్’ వ్యాప్తి
కోవిడెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యల సమక్షంలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. రోగనిరోధక శక్తి తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చికిత్స తీసుకోవాలి. దీర్థకాలిక రోగాలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఈ కేసులు వెలుగు చూస్తున్నందున ప్రజలు నిరంతరం జాగ్రత్తలు పాటించాల్సిందే.
Also Read: ఈ తప్పులు చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పినట్లే.. అవేంటంటే?