కరోనా కి మందు మన దగ్గరే ఉందా !

చైనా లోని వుహాన్ లో మొదలైన కోవిడ్ 19 మహమ్మారి ఇపుడు ఇటలీ దేశాన్ని వణికిస్తోంది. అక్కడ మనుషులు ఎవ్వరూ ఊహించని ఊహించని విధంగా విపత్తు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా ఇటలీలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వైరస్ మొదలయిన చైనా దేశాన్ని దాటేసి ఇక్కడ రికార్డు స్థాయి మరణాలు నమోదు కావడం ఒకింత భయాన్ని కలిగిస్తోంది..చైనా లో ఇంతవరకు 81,496 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 3,153 మంది మరణించారు. కాగా ఇపుడు చైనా […]

Written By: admin, Updated On : March 24, 2020 12:03 pm
Follow us on

చైనా లోని వుహాన్ లో మొదలైన కోవిడ్ 19 మహమ్మారి ఇపుడు ఇటలీ దేశాన్ని వణికిస్తోంది. అక్కడ మనుషులు ఎవ్వరూ ఊహించని ఊహించని విధంగా విపత్తు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా ఇటలీలో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ వైరస్ మొదలయిన చైనా దేశాన్ని దాటేసి ఇక్కడ రికార్డు స్థాయి మరణాలు నమోదు కావడం ఒకింత భయాన్ని కలిగిస్తోంది..చైనా లో ఇంతవరకు 81,496 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 3,153 మంది మరణించారు. కాగా ఇపుడు చైనా లో కరోనా భాదితులు సంఖ్యా గణనీయంగా తగ్గింది నిన్న కేవలం ఒక 40 మంది మాత్రమే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇటలీ లో నిన్నసోమవారం ఒక్క రోజు 700 మరణాలు సంభవించాయి.కాగా 4,789 మంది కొత్త గా కరోనా వ్యాధి బారిన పడ్డారు. దీంతో మొత్తం కరోనా వ్యాధిన పడ్డ వారి సంఖ్య 63, 927కి చేరింది ఇక ఈ విపత్తు ఆరంభం అయిన నాటి నుంచి నేటి వరకు ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 6,077 కు చేరుకుంది.

ఇంత విపత్తులో కూడా ఇటలీలో ఆశ్చర్యకరంగా ఒక అరుదైన కేసు వెలుగులోకి వచ్చింది. మాములుగా కరోనా వైరస్ ప్రభావం యుక్త వయసులో ఉన్న వారి కంటే వయసు మళ్ళిన వారికే అత్యంత ప్రభావాన్ని చూపు తుంది. కానీ ఇటలీలో ఆశ్చర్యకరంగా ఒక 90 ఏళ్ల ముసలావిడ కరోనా నుంచి కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అదెలా సాధ్యం అయిందని ఆలోచిస్తే సదరు వృద్ధ మహిళ ఎక్కువగా ఎండలో సంచరించడం వల్ల ఆమెలో వ్యాధినిరోధక శక్తి బాగా వృద్ధి చెంది త్వరగా కోలుకొందని తేలింది. .

ఆ సంఘటన తో కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోడానికి ప్రకృతి నుంచే ఒక ఊహించని మందు మన కళ్ళ ముందు ఉందని వారు తెలుసు కొన్నారు. సమస్త విశ్వానికి వెలుగును పంచే సూర్య కాంతి నుంచి వచ్చే “డి” విటమిన్ వల్ల కరోనా బాధ కి కొంత ఉపశమనం ఉందని తెలిసింది ఇది పూర్తిగా కరోనా వ్యాధికి విరుగుడు కాదు గాని ఎంతో కొంత మేలు మాత్రం ఉందని రూడీ అయ్యింది. అందుకే ప్రతీ రోజు అరగంట పాటు ఉదయం వచ్చే సూర్య కాంతిని ఆస్వాదిస్తే అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెప్తున్నారు.