దేశంలో తొలి వైరస్ ఫ్రీ జోన్.. ఎక్క‌డో తెలుసా?

దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో రెండో విడుత లాక్డౌన్ మే3 వరకు కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవా కరోనా ఎంట్రీ మూగబోయింది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గోవా దేశంలో తొలి వైరస్ ఫ్రీ జోన్ గా రికార్డు సృష్టించనుంది. దేశంలో అందమైన టూరిస్టు ప్రాంతాల్లో గోవా ఒక్కటి. ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది టూరిస్టులు […]

Written By: Neelambaram, Updated On : April 18, 2020 1:16 pm
Follow us on


దేశంలోకి కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తుంది. కరోనా కేసులు రోజుకు రోజుకు పెరిగిపోతుండటంతో రెండో విడుత లాక్డౌన్ మే3 వరకు కొనసాగుతుందని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. నిత్యం టూరిస్టులతో కళకళలాడే గోవా కరోనా ఎంట్రీ మూగబోయింది. అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గోవా దేశంలో తొలి వైరస్ ఫ్రీ జోన్ గా రికార్డు సృష్టించనుంది.

దేశంలో అందమైన టూరిస్టు ప్రాంతాల్లో గోవా ఒక్కటి. ఈ ప్రాంతానికి నిత్యం వేలాది మంది టూరిస్టులు వస్తూపోతుంటారు. ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేసిన కరోనా మహమ్మరి గోవాలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమాచారంతో గోవా ప్రభుత్వం అందరి కంటే ముందే అప్రమత్తమైంది. దేశంలో తొలిసారిగా విమానాశ్రయంలో ప్రయాణికులను స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించింది. అన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చి 22 నుంచే మూసివేసింది. ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో వైరస్ ప్రబలకుండా కట్టడి చేయగలిగింది.

అదేవిధంగా రాష్ట్రంలో క్రీడా కార్యక్రమాలు, పోటీలు, మత సమావేశాలన్నీ వాయిదా వేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు పెద్దఎత్తున సహకరించారు. దీంతో ఏప్రిల్ 3నాటికి గోవాలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో ఆరుగురు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఒక్కరు చికిత్స పొందుతున్నారు. ఈ బాధితుడు కూడా త్వరలోనే కోలుకుంటాడని ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే గోవాలో ‘సున్నా’ కరోనా కేసులతో దేశంలోనే తొలిసారి వైరస్-ఫ్రీ జోన్ కానుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. కరోనా నుంచి ఒక టూరిస్టు ప్రాంతం కోలుకోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. గోవా బాటలోనే అన్ని రాష్ట్రాలు నడవాలని పలువురు సూచిస్తున్నారు.