దేశంలో 107 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 107కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వారిలో విదేశీయులు 17 మంది ఉన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో… కేంద్ర ప్రభుత్వం దీనిపై ‘‘అధికారిక విపత్తు’’ తరహాలో స్పందించాలని నిర్ణయించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. అందులో తొలి […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 5:35 pm
Follow us on


భారత్‌లో కోవిడ్-19 బారిన పడిన వారి సంఖ్య 107కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. వారిలో విదేశీయులు 17 మంది ఉన్నారు. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ఇప్పటి వరకు దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో… కేంద్ర ప్రభుత్వం దీనిపై ‘‘అధికారిక విపత్తు’’ తరహాలో స్పందించాలని నిర్ణయించింది.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. అందులో తొలి కరోనా పేషెంట్ గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందిన తర్వాత పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. అయితే రాష్ట్రంలో రెండో కరోనా కేసు నమోదైనట్లు శనివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

మరో రెండు శాంపిల్స్ విషయంలో అనుమానం ఉండడంతో పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. వాటిలో ఓ శాంపిల్ పాజిటివ్ వచ్చింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్టాల్లో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి నమోదైన కరోనా కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 33 మంది, కేరళలో 22 మంది కరోనా బారినపడినట్లు తెలిపింది. హర్యానాలో 14 మందికి కరోనా వైరస్ సోకగా.. వారంతా విదేశీయులేని పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 7, కర్ణాటకలో 6, తెలంగాణలో 3, లఢఖ్‌లో 3, జమ్ము కశ్మీర్‌లో 2, రాజస్థాన్‌లో 2 కరోనా కేసులు నమోదైనట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కో కరోనా పేషెంట్ చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.