కరానా ఎఫెక్ట్: కొత్త వ్యాపారంగా అంత్యక్రియలు

మనదేశంలో ప్రతీ మనిషి చనిపోయిన తరువాత సాంప్రదాయంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. దాదాపు 11 రోజుల పాటు సంతాప దినాలు జరుపుతారు. ఆ తరువత కర్మకాండలు నిర్వహించడం ద్వారా చనిపోయిన వ్యక్తికి ఆత్మశాంతి కలుగుతందని భావిస్తారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, ఆత్మీయులు అందరు రావడం వల్ల బాధితుల్లో కూడా కాస్త ధైర్యం నెలకొంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియల చేసే పద్ధతి పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్ సోకి చికిత్సకోసం వెళ్లిన వ్యక్తి మరణిస్తే కనీసం […]

Written By: NARESH, Updated On : May 20, 2021 3:02 pm
Follow us on

మనదేశంలో ప్రతీ మనిషి చనిపోయిన తరువాత సాంప్రదాయంగా దహన సంస్కారాలు నిర్వహిస్తారు. దాదాపు 11 రోజుల పాటు సంతాప దినాలు జరుపుతారు. ఆ తరువత కర్మకాండలు నిర్వహించడం ద్వారా చనిపోయిన వ్యక్తికి ఆత్మశాంతి కలుగుతందని భావిస్తారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, ఆత్మీయులు అందరు రావడం వల్ల బాధితుల్లో కూడా కాస్త ధైర్యం నెలకొంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియల చేసే పద్ధతి పూర్తిగా మారిపోయింది. కరోనా వైరస్ సోకి చికిత్సకోసం వెళ్లిన వ్యక్తి మరణిస్తే కనీసం ముఖం కూడా చూడని పరిస్థితి నెలకొంది.

గతేడాది నుంచి కరోనా కారణంగా చనిపోయిన వారికి కనీసం తాకకుండా అసుపత్రి సిబ్బందికే మృతదేహాలను అప్పగిస్తున్నారు. దీంతో వారు కొంత మొత్తం తీసుకొని ఈ క్రియలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా తమకు సోకుతుందనే భయంతో సొంత కొడుకులు కూడా రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో కొందరు కరోనాతో చనిపోయిన మృతదేహాలను ఆసుపత్రిలోనే విడిచి వెళ్తున్నారు. ఈ పరిస్థితి చూసిన కొందరు స్వచ్ఛంద సంస్థ సభ్యులు జాగ్రత్తలు తీసుకొని అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొందరు కుటుంబ సభ్యలు తమవారు కరోనా చనిపోతే అంత్యక్రియలను ఇతరులతో చేయిస్తున్నారు. ఈ పరిస్థితులను ఆసరగా చేసుకున్న కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సాంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వహించడానికి రూ.40 వేల అడిగారు. సాధారణంగా బంధువులందరూ హాజరై కార్యక్రమం నిర్వహిస్తే రూ.10 వేల ఖర్చు అవుతుందని, ప్రస్తుతం ఆత్మీయులు కూడా లేకుండా దహన సంస్కారాలు చేస్తే రూ.40 వేల నుంచి లక్ష వరకు అడుగుతున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు.

ఇక కొందరు సాధారణంగా చనిపోయాని కరోనా మరణాలగానే లెక్కగడుతున్నారు. దీంతో బంధువులెవరూ రావడం లేదు. దీంతో ఈ అంత్యక్రియలకు కూడా ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వారి సంస్కారాలు నిర్వహిస్తే రూ.30 వేలు అడుగున్నారు. దహన సంస్కార నుంచి అస్థికలు తెచ్చి ఇచ్చే వారు అన్నీ వారే చేస్తున్నారు. గతంలో 11 రోజుల సంతాప దినాలు ఉంటే ప్రస్తుతం మూడురోజుల్లోనే అన్నీ కానిచ్చేస్తున్నారు. ఇలా మన దేశంలో సగటున ఒక్కో మరణానికి రూ.50 వేల ఖర్చు అవుతుందని పేర్కొంటున్నారు.