భారతదేశానికి పల్లెలు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. లక్షల కోట్లతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నమని గొప్పలు చెప్పే పాలకులు మాత్రం పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన పాపానా పోవడం లేదు. ప్రభుత్వాలు ఎన్నిమారినా పల్లెల్లో అభివృద్ధి ఎడారిలో ఒయాసిస్ లా మారుతోంది. నేటికి పల్లెలు కేవలం వ్యవసాయం మీదనే ఆధాపడుతోన్నాయి. పల్లెల్లో కుటీర పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేయాల్సిన ప్రభుత్వాలు మాత్రం వాటిని పట్టించుకోకపోవడంతో ఉపాధి కోసం పల్లెవాసులు నగరాలకు పయనమవుతున్నారు.
నగరాలు అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చిది పెద్దపెద్ద భవంతులు.. హంగులు, ఆర్భాటాలు, మల్టిఫెక్సులు, షాపింగులు వగైరా.. ఇక మెట్రోనగరాల్లో అయితే నగరవాసులది ప్రత్యేక కల్చర్ అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక పల్లెవాసులకు నగరం అనేది భూతలస్వర్గంలా కన్పిస్తుంది. దూరం నుంచి చూసి ఎప్పుడెప్పుడు నగరాలకు వెళ్లిపోదామా అంటూ ఎదురుచూస్తుంటారు. పల్లెల్లో వ్యవసాయ పనులు ఒంటికిపట్టనివారు, చదువుకున్న వారంతా నగరాల్లో సెటిలయ్యేందుకే మొగ్గుచూపుతుంటారు.
కరోనాకు గబ్బిలాలే దారి చూపిస్తున్నాయా?
నగర నిర్మాణాల ప్రతీఒక్కరి భాగస్వామ్యం అవసరమే. వలస కూలీల దగ్గరి నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకు ప్రతీఒక్కరి భాగస్వామ్యాన్ని నగరాలు కోరుకుంటాయి. వీరందరికీ ఉపాధి కల్పించి అక్కున చేర్చుకుంటాయి. అయితే ఇదంతా కూడా కరోనా రాక ముందుమాట. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో అన్నిదేశాలు లాక్డౌన్ విధించాయి. భారత్లోనూ లాక్డౌన్ విధించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆన్ లాక్ 2.0లో కరోనా ఎఫెక్ట్ తీవ్ర ప్రభావం చూపుతోంది.
దేశంలో నమోదవుతున్న 89శాతం కరోనా కేసులు 49నగరాల్లో ఉన్నాయని కేంద్రం లెక్కలు చెబుతోన్నాయి. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు నగరాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ఉపాధి కోసం వచ్చిన జనం ఇప్పుడు సొంతూళ్లకు పయమనవుతున్నారు. జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం హైదరాబాద్ నుంచి ఇప్పటికే 25లక్షల మంది జనం సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. ఇక బెంగూళూరులో దాదాపు 15లక్షల మంది తరలివెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగరాల్లో ఎక్కడ చూసిన టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.
కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలు?
వలస కార్మికులంతా పల్లెలకు తిరిగి వెళుతుండటంతో ఆ ప్రభావం నగరాలపై తీవ్రంగా చూపుతోంది. నగరంలోని నిర్మాణ రంగాలు, వివిధ పరిశ్రమల్లో మ్యాన్ పవర్ లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లాక్డౌన్ ప్రభావం నగరాలపై ప్రభావం చూపడంతో అన్నిరంగాలు కుదేలవుతున్నాయి. కరోనా కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతుండటంతో నగరాలన్నీ కూడా వెలవెలబోతున్నాయి. లాక్డౌన్ ఎత్తినప్పటికీ పల్లెవాసులు ప్రస్తుత పరిస్థితుల్లో నగరాలకు వెళ్లేందుకు జంకుతున్నారు.
కరోనా సమయంలో పల్లెలే సేఫ్ అని జనాల్లో నాటుకుపోయింది. నగరవాసుల కంటే పల్లెవాసులే కరోనా నిబంధనలు పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో నగరాల్లో సెటిలైనవారు సైతం ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెలకు తరలి వెళుతున్నారు. మహమ్మరి పూర్తిగా వెళ్లేంత వరకు కూడా వారంతా నగరాలకు వెళ్లేలా కన్పించడం లేదు. ప్రభుత్వాలు పల్లెల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు.
ఓట్ల సమయంలో పాలకులకు గుర్తొచ్చే పల్లెజనాల అవసరాలు గద్దెనెక్కాక మరిచిపోవడం శోచనీయంగా మారుతోంది. ఇప్పటికైనా పాలకులు పల్లెలను అభివృద్ది చేయాలని డిమాండ్లు పెద్దఎత్తున విన్పిస్తున్నాయి. కరోనా పుణ్యమా అని పల్లెలైనా అభివృద్ధి చెందుతాయో లేదో వేచి చూడాల్సిందే..!