3లక్షల కరోనా మరణాలు!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండటం గమనార్హం. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992. వ్యాధి నుంచి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల […]

Written By: Neelambaram, Updated On : May 14, 2020 10:24 am
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉండటం గమనార్హం. ఈ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 213 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల 27 వేల 900 కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 24 లక్షల 71 వేల 992. వ్యాధి నుంచి కోలుకొని 16 లక్షల 57 వేల 831 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షల 98 వేల 77 మంది చనిపోయారు.

కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలిలా ఉన్నాయి. అమెరికా-85,197, స్పెయిన్‌-27,104, రష్యా-2,212, యూకే-33,106, బ్రెజిల్‌-13,158, ఫ్రాన్స్‌-27,074, జర్మనీ-7,861, టర్కీ-3,952, ఇరాన్‌-6,783, చైనా-4,633, పెరూ-2,169, కెనడా-5,302, బెల్జియం-8,843, నెదర్లాండ్స్‌-5,562, మెక్సికో-4,220, ఈక్విడార్‌-2,334, స్విట్జర్లాండ్‌-1,870, పోర్చుగల్‌-1,175, స్విడన్‌-3,460, ఐర్లాండ్‌-1,497, రోమేనియా-1,036, ఇండోనేషియాలో 1,028 వ్యాధి కారణంగా చనిపోయారు.

భారత్‌ లో కూడా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వైరస్‌ సోకి 134 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం​ కరోనా కేసుల సంఖ్య 78,003కి చేరుకోగా.. మృతుల సంఖ్య 2,549కి చేరింది.