‘గాంధీ’ని ఎవరు పట్టించుకోవడం లేదా?

కరోనాకు చికిత్స అందించడంలో గాంధీ ఆస్పత్రి బాగా పని చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని విపక్షాలు చేస్తున్న అసత్యలను నమ్మవద్దని మంత్రులు చెబుతున్నారు. తెలంగాణలో కోవిడ్-19 గాంధీ కేరాఫ్ అడ్రస్ గా మారాక ప్రభుత్వం ఈ ఆస్పత్రి దృష్టిసారించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం కరోనాపై నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కావాల్సిన సదుపాయాలన్ని సమకూరుస్తున్నారు. అయినప్పటికీ గాంధీ ఆస్పత్రిపై తరుచూ వివాదాలు చోటుచేసుకుండటం చర్చనీయాంశంగా […]

Written By: Neelambaram, Updated On : July 15, 2020 5:08 pm
Follow us on


కరోనాకు చికిత్స అందించడంలో గాంధీ ఆస్పత్రి బాగా పని చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని విపక్షాలు చేస్తున్న అసత్యలను నమ్మవద్దని మంత్రులు చెబుతున్నారు. తెలంగాణలో కోవిడ్-19 గాంధీ కేరాఫ్ అడ్రస్ గా మారాక ప్రభుత్వం ఈ ఆస్పత్రి దృష్టిసారించింది. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం కరోనాపై నిరంతరం సమీక్షలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో కావాల్సిన సదుపాయాలన్ని సమకూరుస్తున్నారు. అయినప్పటికీ గాంధీ ఆస్పత్రిపై తరుచూ వివాదాలు చోటుచేసుకుండటం చర్చనీయాంశంగా మారుతోంది.

గాంధీ ఆస్పత్రి నుంచి వందల సంఖ్యలో కరోనా రోగులు కోలుకొని వెళుతుండగా మరోవైపు తీవ్ర వివాదాలు కూడా నెలకొంటున్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు సరైన వైద్యం అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా మృతదేహాలు మాయం అవడం.. ఒకరికి బదులుగా మరొకరు శవాలను బంధువులకు అప్పగించడం వంటివి వెలుగుచూశాయి. పలువురు కరోనా రోగులు తమకు కనీసం ఆక్సిజన్ కూడా పెట్టడంలేదని సోషల్ మీడియాలో పోస్టుపెట్టడం సంచలనంగా మారాయి. ఈ ప్రచారం మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు.

సామాన్యులు గాంధీకి.. ప్రజాప్రతినిధులు ప్రైవేటుకు..!

తాజాగా గాంధీలో చోటుచేసుకున్న సంఘటన అక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారాయో తెలియజేస్తోంది. గాంధీలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెంది 8గంటలైనా పట్టించుకోకపోవడం శోచనీయంగా మారింది. మృతదేహాన్ని కనీసం వార్డు నుంచి మార్చురీకి తరలించక పోవడంపై తోటి రోగులను కలవరానికి గురిచేసింది. కొందరు ఈ దృశ్యాలను వీడియోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటికి పొక్కింది. ఆస్పత్రిలోని కొందరు సిబ్బంది ఆందోళన చేస్తుండటం వల్ల మృతదేహాన్ని తరలించడం ఆలస్యమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపారు. అయితే మృతదేహం కుళ్లిపోయినా పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదంటున్నారు.

మరోవైపు గాంధీలోని పోరుగు సేవల కింద పనిచేస్తున్న నర్సులు ఐదురోజులుగా సమ్మె చేస్తున్నారు. దీనికితోడు మంగళవారం నుంచి నాలుగో తరగతి ఉద్యోగులు కూడా సమ్మె దిగడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సమయంలో సేవలందిస్తున్న వైద్య సిబ్బందితో ప్రభుత్వం చర్చలు జరుపకుండా మీనమేషాలు లెక్కించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా నివారణకు కోట్ల రూపాయాలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం వైద్య సిబ్బంది సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాంధీలో పరిస్థితి చేయిదాటకముందే ప్రభుత్వం చొరవచూపి సమస్యను పరిష్కరించాలని సర్వత్రా కోరుతున్నారు.