సిద్ధమవుతున్న కరోనా కమాండో… ఏమి చేస్తారంటే..

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది . చైనా తరువాత ఇటలీలో ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. కరోనా కారణంగా భారతదేశంలో 40 మందికి పైగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి ‘కరోనా కమాండో’ను సిద్ధం చేస్తోంది. వారు ఎక్కడికైనా వెళ్లి కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స అందిస్తారు. ఈ కరోనా కమాండోలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆసుపత్రిలో శిక్షణ ఇస్తున్నారు కరోనా వైరస్ […]

Written By: Neelambaram, Updated On : March 9, 2020 3:38 pm
Follow us on

కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది . చైనా తరువాత ఇటలీలో ఈ వైరస్ కారణంగా పెద్ద సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. కరోనా కారణంగా భారతదేశంలో 40 మందికి పైగా రోగులు అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ఆసుపత్రి ‘కరోనా కమాండో’ను సిద్ధం చేస్తోంది. వారు ఎక్కడికైనా వెళ్లి కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగికి చికిత్స అందిస్తారు. ఈ కరోనా కమాండోలకు ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆసుపత్రిలో శిక్షణ ఇస్తున్నారు కరోనా వైరస్ పై పోరాటానికి కెజిఎంసి ఈ ప్రయత్నం చేసింది. కరోనా కమాండోలకు కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పల్మనరీ విభాగంలో శిక్షణను ప్రారంభించారు.

నెల రోజుల పాటు సాగే శిక్షణలో కరోనాను ఉపశమింపజేసే విధానాలను తెలియజేయనున్నారు. కరోనా కమాండో అని ఈ బృందానికి పేరు పెట్టారు. అతిపెద్ద ఐసియు యూనిట్‌ను దీనికి అనుసంధానించారు. ఇది కరోనావైరస్‌తో పోరాడటానికి, రోగి కోలుకోవడానికి ఉపకరిస్తుంది. కరోనావైరస్ పై పోరాడటానికి వైద్యుల బృందం అవసరం అయినప్పటికీ, కరోనా కమాండోల బృందం అక్కడికి వెళ్లి వారికి చికిత్స అందించవచ్చు. ఈ యూనిట్ ను డాక్టర్ వేద ప్రకాష్ స్వయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ కమాండోలు ఇతర ఆసుపత్రుల వైద్యులకు నిరంతరం కరోనావైరస్ తో పోరాడటానికి శిక్షణ ఇస్తున్నారు. భారతదేశంలోని ఉత్తమ ఐసియు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ పల్మనరీ విభాగానికి చెందిన హెచ్ఓడి వేద్ ప్రకాష్, కరోనా కమాండోలు అనే బృందాన్ని సిద్ధం చేశారు. వీరు శీఘ్ర ప్రతిస్పందన రెస్క్యూ టీం మాదిరిగా వ్యవహరిస్తారు. డాక్టర్ వేద్ ప్రకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బృందం గత ఒక నెల రోజులుగా పలు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు శిక్షణ ఇచ్చిందన్నారు.