https://oktelugu.com/

Coronavirus: ప్రపంచాన్ని మరోసారి కబళించడానికి వస్తున్న కరోనా

Coronavirus: కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వ్యాధి తీవ్రతతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మరోమారు పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటన్, రష్యా, చైనా, ఆస్రేలియా, ఉక్రెయిన్, సెర్బియా, క్రొయేషియా, స్లొవేనియా, రుమేనియాల్లో కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రష్యాలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా వెయ్యి మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్ లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : October 24, 2021 / 05:32 PM IST
    Follow us on

    Coronavirus: కరోనా వైరస్ ఇంకా ప్రపంచాన్ని గడగడలాడిస్తూనే ఉంది. వ్యాధి తీవ్రతతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. వివిధ దేశాల్లో మరోమారు పంజా విసిరేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా బ్రిటన్, రష్యా, చైనా, ఆస్రేలియా, ఉక్రెయిన్, సెర్బియా, క్రొయేషియా, స్లొవేనియా, రుమేనియాల్లో కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రష్యాలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా వెయ్యి మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది.

    బ్రిటన్ లో వేగంగా వ్యాపిస్తున్న డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. దీంతో దేశంలో కేసులు పెరగడానికి కారణమవుతుందని తెలుస్తోంది. వైరస్ ప్రవర్తనలో వస్తున్న మార్పులతోనే వైరస్ వేగంగా విస్తరిస్తోందని సమాచారం. బ్రిటన్ లో కేసులు మరింత పెరుగుతున్నాయి. డెల్టా వేరియంట్ వల్ల వైరస్ వేగంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంక్షలు విధించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    రష్యాలో తాజాగా 37 వేల కేసులు, 1075 మరణాలు సంభవించడం చూస్తుంటే వ్యాధి మరోసారి ఉగ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయని శాస్ర్తవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ నాటి గణాంకాలతో పోలిస్తే ప్రస్తుతం కేసులు 70 శాతం, మరణాలు 33 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. కొవిడ్ బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయని చెబుతున్నారు.

    ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి మరోసారి పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు చూస్తుంటే ఇది వాస్తవమేనని అనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుంటే ఆందోళన కూడా పెరుగుతోంది. మెల్లగా వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో లాక్ డౌన్ విధించే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైరస్ ను తుదముట్టించే పనిలో భాగంగా పలు మార్గాలు అన్వేషించాల్సి వస్తోంది.

    Tags