AP Corona Cases: ఏపీలో కరోనా కల్లోలం.. భారీగా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో బీభత్సం

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ మరోసారి కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణికుతోంది. కొద్దిరోజులుగా బీభత్సంగా కేసులు పెరుగుతున్నాయి. జనాలను భయపెడుతున్నాయి. ఒక్కరోజులో ఏకంగా 5వేల వరకూ కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మరోసారి దేశం లాక్ డౌన్ దిశగా సాగుతుందనుకుంటున్న వేళ ఏపీలోనూ అలాంటి పరిస్థితులు ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. కొద్దిరోజులు కొత్త కేసులు ఆందోళనకరరీతిలో పెరగడం ఆందోళనకు కారణమవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో […]

Written By: NARESH, Updated On : January 15, 2022 8:33 pm
Follow us on

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్ మరోసారి కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణికుతోంది. కొద్దిరోజులుగా బీభత్సంగా కేసులు పెరుగుతున్నాయి. జనాలను భయపెడుతున్నాయి. ఒక్కరోజులో ఏకంగా 5వేల వరకూ కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. మరోసారి దేశం లాక్ డౌన్ దిశగా సాగుతుందనుకుంటున్న వేళ ఏపీలోనూ అలాంటి పరిస్థితులు ఆందోళనకు కారణం అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభిస్తోంది. కొద్దిరోజులు కొత్త కేసులు ఆందోళనకరరీతిలో పెరగడం ఆందోళనకు కారణమవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

ఏపీలో నిన్న 4528 కేసులు నమోదవ్వగా.. ఈరోజు ఏకంగా 4955 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. 5వేలకు ఒక్కరోజు కేసులు పెరగడం జనాల్లో భయాన్ని పెంచుతోంది. కరోనా ధాటికి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.

గడిచిన 24 గంటల్లో ఏపీలో 4955 కేసులు నమోదు కాగా.. 397 మంది కోలుకున్నారు.ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 22870కి చేరింది. ఇక మొత్తం కరోనా మరణాల సంఖ్య 14509కి పెరిగింది.

ఇక ఏపీలోని రెండు జిల్లాలు కరోనా హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. వాటిల్లో ఏకంగా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా ఈరోజు విశాఖలో కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 1103 కేసులు, చిత్తూరు జిల్లాలో 1039 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరిలో 55 కేసులు నమోదయ్యాయి. విశాఖ, చిత్తూరులలో భారీ కేసులు వరుసగా నమోదు కావడంతో ఆయా జిల్లాలో ఆంక్షలు పెట్టే దిశగా అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది.