టీటీడీ అధికారుల అర్థంలేని లాజిక్!

తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, మండలాల్లో పలు వార్డులు, గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46కు పైగా కంటైన్మెంట్ జోన్లను నిర్ణయించారు. అయితే, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే తప్ప ప్రజలు నివసించే ప్రదేశం కాదని, కరోనాపాజిటివ్ వచ్చిన వారంతా తిరుపతిలో నివాసం ఉండేవారే తప్ప తిరుమలలో ఉండేవారు కాదని.. అలాంటప్పుడు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌ గా ఎలా ప్రకటిస్తారని […]

Written By: Neelambaram, Updated On : July 10, 2020 10:14 am
Follow us on

తిరుమలలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 18 మున్సిపాలిటీలు, మండలాల్లో పలు వార్డులు, గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 46కు పైగా కంటైన్మెంట్ జోన్లను నిర్ణయించారు.

అయితే, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే తప్ప ప్రజలు నివసించే ప్రదేశం కాదని, కరోనాపాజిటివ్ వచ్చిన వారంతా తిరుపతిలో నివాసం ఉండేవారే తప్ప తిరుమలలో ఉండేవారు కాదని.. అలాంటప్పుడు తిరుమలను కంటైన్మెంట్ జోన్‌ గా ఎలా ప్రకటిస్తారని టీటీడీ అధికారులు అర్థం లేని లాజిక్ వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ర్యాపిడ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అయితే అవి లక్ష్యానికి తగ్గట్టుగా జరగడం లేదని, అందులో యాత్రికుల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షలు వేగవంతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాలు ఆదేశాలు జారీ చేశారు.

“టీటీడీ సిబ్బందికి కరోనా పరీక్షలు పెంచాలి. ముమ్మరంగా చేయాలి. అవసరం ఉన్న వారికి, అనుమానితులకు పరీక్షలు చేయాలి. దానికి తగ్గట్టుగా ట్రూనాట్ మిషన్లను కూడా కొనుగోలు చేయాలని ఆదేశించాం. ఇక ఉద్యోగుల భద్రత ముఖ్యం. వారికి సమస్యలు రాకుండా చూడడానికి ఉద్యోగుల క్యాంటీన్ లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారం అందించాలని నిర్ణయించాం. ఉద్యోగుల భద్రతపై తగిన శ్రద్ధ పెడుతున్నాం. ఇళ్లకు వెళ్లిన సిబ్బంది వివరాలు కూడా సేకరిస్తున్నాం. వారి ఆరోగ్య పరస్థితిపై ఆరా తీస్తున్నాం” అంటూ ఈవో తెలిపారు.

కరోనావైర‌స్‌ లాక్‌ డౌన్‌ కారణంగా 82 రోజుల పాటు నిలిచిపోయిన దర్శనాలకు గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతిచ్చింది. నాటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు నిత్యం దర్శనాలకు వస్తున్నారు. భక్తులతో పాటుగా సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ ఆదేశాలు ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. అయినప్పటికీ తిరుమలలో పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి.

ఒక్క తిరుమలలోనే ఇప్పటికి 80 మందికిపైగా పాజిటివ్‌ గా తేలారు. దిగువన తిరుపతిలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండడం, వారిలో టీటీడీ సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో కలవరం మొదలయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. ఉద్యోగుల భద్రతకు ఢోకా లేకుండా పరీక్షలు పెంచి, రోగనిరోధక శక్తికి అవసరమైన ఆహారం కూడా అందించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.