https://oktelugu.com/

Movie Ticket Rates: పేదలు సినిమాను ఇప్పుడెలా చూడాలి..? టిక్కెట్ల రేట్లు ఎవరి కోసం పెంచినట్లు..?

Movie Ticket Rates: ఏపీలో సినిమాలు రిలీజ్ చేసేవారికి సగమే ఊరట కల్పిస్తూ సీఎం జగన్ జీవో జారీ చేశారు. టిక్కెట్ల రేట్ల పెంచుతూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కొన్ని సినిమాలకు ఇది లాభం చేకూరుస్తుందన్న వాదన ఉంది. జీవో రిలీజ్ తో సినిమా థియేటర్లలో మునుపటిలా టిక్కెట్ల రేట్లు ఉండనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 8, 2022 / 04:12 PM IST
    Follow us on

    Movie Ticket Rates: ఏపీలో సినిమాలు రిలీజ్ చేసేవారికి సగమే ఊరట కల్పిస్తూ సీఎం జగన్ జీవో జారీ చేశారు. టిక్కెట్ల రేట్ల పెంచుతూ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. కొన్ని సినిమాలకు ఇది లాభం చేకూరుస్తుందన్న వాదన ఉంది. జీవో రిలీజ్ తో సినిమా థియేటర్లలో మునుపటిలా టిక్కెట్ల రేట్లు ఉండనున్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో కొత్త చర్చ మొదలైంది. సినీ ప్రముఖులంతా ప్రత్యేకంగా సీఎం జగన్ ను కలిసి విన్నవించినా ఇంత ఆలస్యంగా జగన్ ఇప్పుడు ఏకంగా జీవో జారీచేయడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. పనిలో పనిగా ఇన్నాళ్లు పేదల కోసమే టిక్కెట్ల తగ్గించామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు వారు గుర్తుకు రాలేదా..? అని ప్రశ్నిస్తున్నారు.

    పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిన కారణంగానే సినిమా టిక్కెట్ల రేట్లను ఇప్పుడు పెంచారా…? అన్న కొత్త వాదన వినిపిస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు భీమ్లానాయక్ సినిమా రిలీజ్ సమయంలో పెంచని టిక్కెట్ల ధరలను ఇప్పుడు సీఎం ను కలిసిన వారి సినిమాలకు లాభం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తాడేపల్లిలో గతనెలలో సీఎం జగన్ ను మెగాస్టార్ చిరంజీవితో పాటు ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివలు కలిశారు. వీరి సినిమాలు పూర్తై త్వరలో రిలీజ్ కాబోతున్నాయి. ఈనెల 11న ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ విడుదల కానుంది. ఇంతకాలం ఈ విషయంపై స్పందించని జగన్ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా చర్చ సాగుతోంది.

    సినిమా టిక్కెట్ల ధరల పెంపు ఇండస్ట్రీ హర్షించదగ్గ విషయమే. కానీ ప్రభుత్వం పాడిన పాటకు ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి పొంతనలేదని అంటున్నారు. ఇన్నాళ్లు పేదలు సైతం సినిమాలు చూడాలని టిక్కెట్ల రేట్లు తగ్గించామని అన్నారు. సీఎం జగన్ సైతం కొన్ని సందర్భాల్లో పేదల కోసమే టిక్కెట్ల రేట్లు తగ్గించామని చెప్పుకొచ్చారు. ఓ సభలో ‘పేదల కోసం టిక్కెట్ల రేట్లు తగ్గిస్తే దాన్ని కూడా తప్పుబడుతున్నారనంటూ వాదించారు.

    కానీ ఇప్పుడు ఓ వైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సమయంలో టిక్కెట్ల రేట్లు పెంచితే పేదలెలా చూస్తారు జగన్..? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. టిక్కెట్ల రేట్ల పెంపుపై కొందరు హర్షిస్తుండగా జగన్ కొందరు సినిమా వాళ్లను తన ఆధీనంలో ఉంచుకునేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిపోయిందని, కొందరు ప్రభుత్వానికి మద్దతుగా ఉండగా.. మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారని గతంలోనూ విమర్శలు వచ్చాయి. వాటిని కొందరు సినీ పెద్దలు కొట్టిపారేసినా మా ఎలక్షన్స్ లో అవి బయటపడ్డాయి. ఇక ఇప్పుడు పవన్ కల్యాన్ సినిమా విడుదలై జోష్ తగ్గిన తరువాత తనను కలిసిన వారి సినిమాల విడుదల ముందు రేట్లు పెంచడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.