ప్రపంచంలోనే ప్రత్యేక పేరు తెచ్చుకున్న అనంత పద్మనాభస్వామి ఆలయం మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ ఆలయంలోని నేల మాళిగలో అత్యంత విలువైన సంపద ఉన్నట్లు గతంలో ప్రచారం సాగింది. అయితే అప్పటి నుంచి ఆలయ సంపదపై చర్చ సాగుతూనే ఉంది. తాజాగా ఆలయంలో నిర్వహించిన ఆడిటింగ్ వివరాలు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1990 నుంచి 2014 వరకు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో ఆడిటింగ్ జరుగుతోంది. ఈ వివరాలను తెలియజేయాలని తాజాగా సుప్రీం ఆదేశాలివ్వడంతో మరోసారి ఈ ఆలయం చర్చల్లోకి వచ్చింది.

కోర్టు నియమించిన అమికస్ క్యూరీ ఓ నివేదికను అందించింది. దీని రిపోర్టు ప్రకారం కొన్నేళ్లపాటు కాగ్ జనరల్ కంట్రోలర్ వినోద్ రాయ్ ఆలయ అకౌంట్లపై ఆడిటింగ్ నిర్వహించినట్లు తెలిపింది. ఆయన నిర్వహించిన ఆడిట్ ప్రకారం అప్పట్లోనే ఆలయంలో లక్షకోట్ల విలువైన ఆభరణాలుంటాయని తెలిపారు. అయితే పురాతన వస్తువుల విలువపై ఇంకా లెక్క తేల్చలేదు. అయితే ఆలయం ఇంత సంపదను కలిగి ఉన్నా నిధుల కోసం కొందరు కోర్టుకెక్కారు. ఆలయం ఆదాయం పడిపోవడంతో ఆలయ నిర్వహణ, సిబ్బంది జీతాల ఇతర ఖర్చులకు నిధులు కావాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పాలనా కమిటీ ఆలయ ట్రస్టును సంప్రదించడంతో అక్కడా వారికి నిరాశే ఎదురైంది. వారికి ఎలాంటి సాయం అందలేదు. అయితే పాలనా కమిటీ, ఆలయం ట్రస్టు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అందువల్ల వారు నిధులు ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు.
దేశంలో సంస్థానాలు విలీనం చేసినప్పుడు కేరళ ఆలయానికి మినహాయింపు ఇచ్చింది. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ బోర్డుకు అప్పగించింది. 1941 వరకు ఆలయ రాజ్యాన్ని పాలించిన రాజు బలరామ వర్మ 1991లో మరణించాడు. ఆ తరువాత ఆయన సోదరుడు మార్తాండ వర్మ ఆలయ పగ్గాలు చేపట్టారు. దీంతో ఆలయ సంపద మొత్తం తమ కుటుంబానిదేనన్నారు. అయితే కొందరు భక్తులు కోర్టుకెక్కారు. అయితే 2011లో మార్తాండ వర్మ ఆలయ పాలకుడు ఉండరని చెప్పింది. ఆలయ బాధ్యతలు చూసుకోవడానికి కమిటీ లేదా ట్రస్టును ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే మార్తాండ సుప్రీంకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరారు. దీంతో సుప్రీం కోర్టు మార్తాండ కుటుంబానికే ఆలయ హక్కులు దక్కుతాయని, ఆ కుటుంబానికే నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ఆ సమయంలో ప్రముఖ లాయర్ గోపాల్ సుబ్రహ్మణ్యం అమికస్ క్యూరీగా నియమించి వినోద్ రాయ్ అధ్యక్షతన ఒక అడిట్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో ఈ కమిటీ అనంత పద్మనాభస్వామి 18 అడుగుల విగ్రహాన్ని అలంకరించడానికి తయారు చేసిన కిరీటం, కడియాలు, ఉంగరాలు, విలువ లక్ష కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కమిటీ ఆలయంలోని బి గదిని తెరవలేకపోయింది. దీనిని తెరవడం వల్ల అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని రాజవంశీయులు తెలిపారు.
1965లో బలరామ వర్మ ఆలయ ట్రస్టును ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆలయానికి సంబంధించిన పూజలు, పరిసరాల్లోని భవనాలు, హోమాలు చేయాలని నిర్ణయించింది. అయితే అమికస్ క్యూరీ మాత్రం ట్రస్టు ఆలయ ఆదాయాన్ని సరిగా నిర్వహించలేదని తెలిపింది. అందువల్ల ఖాతాలు ఆడిటింగ్ చేయడం తప్పనిసరిగా పేర్కొంది. ఆలయ ట్రస్టుకు వివిధ మార్గాల ద్వారా చాలా విరాళాలు వస్తున్నాయని, అయితే వాటికి సంబంధించిన వివరాలు లేవని పేర్కొంది. పబ్లిక్ ట్రస్టును బాధ్యతగా నిర్వహించాల్సిన అవసరం ఉన్నా దానిని పట్టించుకోలేదని వివరించింది. అంతేకాకుండా ఆలయంలోని కొన్ని ఆభరణాలు మిస్సయ్యాయని బంగారం తగ్గిందని తెలిపింది. అయితే ఖాతాల్లో అవకతవకలు జరిగి ఉంటే మమ్మల్ని ఎప్పుడో తొలగించేవాళ్లని ట్రస్టు సభ్యులు అంటున్నారు.