Jagga Reddy vs Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారుతోంది నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో పార్టీ భవితవ్యం డోలాయమానంలో పడుతోంది రెండడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అనే ధోరణి కనిపిస్తోంది. పార్టీ ముందుకు వెళ్లలేకపోతోంది. అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగట్టే క్రమంలో ఎవరు ముందుకు రాకపోవడంతో ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇంకా కొద్ది రోజులు ఇలాగే ఉంటే ప్రజలతో పాటు కార్యకర్తలు కూడా మరిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం పార్టీలో సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఆయన పార్టీకి రాజీనామా చేస్తామని చెప్పడం సంచలనం కలిగిస్తోంది. పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నా తనకు పార్టీలో ప్రాధాన్యం లేదని, పైగా తనను టీఆర్ఎస్ కోవర్టుగా చిత్రీకరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారనే బాధతోనే పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకాన్ని అందరు తప్పుబట్టారు. టీడీపీ నుంచి వచ్చిన ఆయనకు పీసీసీ పదవి ఇవ్వడమేమిటని విమర్శలు వచ్చాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న మమ్మల్ని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎందుకు అందలాలు ఎక్కిస్తున్నారని అప్పట్లో బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. దీనిపై అధిష్టానం కూడా చొరవ చూపి అందరిని చల్లబరచినా రేవంత్ కు మాత్రం ఇప్పటికి చాలా మంది నేతలు సహకరించడం లేదు. దీంతో పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికితోడు జగ్గారెడ్డి వ్యవహారం కూడా పార్టీకి నష్టమే కలిగించేలా ఉంది. దీంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఆయన మాత్రం తగ్గడం లేదు. రాజీనామా చేసేందుకే సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. రాజీనామా చేసినా ఏ పార్టీలో చేరనని స్పష్టం చేస్తున్నారు. సొంతంగా పార్టీ పెడతానని పేర్కొనడం గమనార్హం. దీంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసినా ఆయన తన అభిప్రాయం మార్చుకోనని చెప్పడం తెలిసిందే.
Also Read: Bolli Kishan-Jagga Reddy: హతవిధీ.. కాంగ్రెస్ లో ఈ పని ఏంటి? జగ్గారెడ్డి కాళ్లు పట్టుకున్నాడు..
భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లడం కష్టమే. ప్రజలు కూడా మెల్లగా మరిచిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ సొంత నేతలతోనే దానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధిష్టానం కూడా పట్టనట్లుగా వ్యవహరించడంతోనే నేతల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. జగ్గారెడ్డి టీఆర్ఎస్ కోవర్టు అని చెబుతూ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగులతో బాధ పడుతూ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం గమనార్హం.
Also Read: Jagga Reddy Resign: జగ్గారెడ్డి రాజీనామాను ఆమోదిస్తుందా? అడ్డుకుంటుందా?
Recommended Video: