Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు దొరికిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ ను హత్య చేసేందుకు ఢిల్లీ కేంద్రంగా కుట్ర జరిగినట్లు సమాచారం. దీనిపై బీజేపీ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందులో మరో మహిళా నేత, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రమేయం ఉన్నట్లు వార్తలు రావడం తెలిసిందే.
దీంతో జితేందర్ రెడ్డి, డీకే అరుణ పాత్రలపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉందనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే ఈ కేసులో నిందితులుగా గుర్తించిన వారు ఢిల్లీలోని జితేందర్ రెడ్డి ఇంట్లో ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఎంత ఉంది అనే దానిపై పలు కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.
Also Read: కేసీఆర్ ఢిల్లీ టూర్.. టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటం
శ్రీనివాస్ గౌడ్ హత్యకు 8 మంది ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు చెబుతున్నారు. వారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకుని మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు వెల్లడిస్తున్నారు,. దీంతో శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిన సందర్భంలో రాజకీయ వైషమ్యాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కేసులో మరో నేత డీకే అరుణ పాత్ర ఉందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఆమె విలేకరుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకెవరిని చంపాల్సిన అవసరం లేదని చెప్పారు. దర్యాప్తు చేయించి నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు. శ్రీనివాస్ గౌడ్ అరాచకాలు అందరికి తెలుసన్నారు. కానీ తనకు ఆయనను హత్య చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.లేనిపోని ఆరోపణలు సరైనవి కాదని పేర్కొన్నారు.
దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల హత్యల విషయాలు వెలుగులోకి వస్తుండటంతో రాజకీయ నేతల్లో భయం పట్టుకుంది. దీనిపై దర్యాప్తు ముమ్మరం చేసి నిజానిజాలు వెలికి తీసి తగిన ఆధారాలతో నిందితులను పట్టుకోవాలని పోలీసులు ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి ఇందులో ఇంకా ఎవరెవరి పాత్రలు ఉన్నాయో వెలుగు చూసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ -రష్యా వార్.. అభాసుపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్