https://oktelugu.com/

Congress: కాంగ్రెస్ టార్గెట్ 200 ఎంపీ సీట్లు..సాధ్యమ‌య్యేనా..?

దేశవ్యాప్తంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా బిజెపి హవా నడుస్తుందనేది సెంటు పర్సెంట్ వాస్తవం. మోడీ మానియా.. హిందూ భావజాల వ్యాప్తి పెరిగిపోవడం,ఎన్డీఏ సర్కార్‌పై అవినీతి మరకలు లేక‌పోవ‌డం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి.

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2024 / 04:58 PM IST

    Congress

    Follow us on

    Congress: కాంగ్రెస్ కు కేంద్రంలో అధికారం చేజారి దశాబ్ద కాలమవుతుంది. ఈ పదేళ్లలో దేశవ్యాప్తంగా హస్తం ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. తాను అనుకున్న అంచనాలను ఎక్కడా రీచ్ కాలేకపోయింది. కీలకమైన రాష్ట్రాల్లోనూ సత్తా చాటలేక బోల్తా కొట్టింది. ఫలితంగా కాంగ్రెస్ క్యాడర్లో నిరుత్సాహం పెరిగిపోయింది. అటు కేంద్రంలోనూ ఇటు కీలకమైన రాష్ట్రాల్లోనూ పార్టీ ప్రభావం లేకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి లోక్ సభకు జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో స్పష్టమైన సీట్లను టార్గెట్‌గా పెట్టుకుని పని చేస్తోంది. ఈసారి ఎలాగైనా సుమారు 200 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మిగతా 100 స్థానాల్లో విపక్ష పార్టీల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు గెలుచుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తోంది. తద్వారా కేంద్రంలో తన మిత్ర పక్షాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని భావిస్తుంది.

    2004లో కాంగ్రెస్ 145 లోక్సభ ఎంపీలను గెలుచుకుంది. అయినప్పటికీ తన యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిపి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగింది. అలాగే 2004 కన్నా 2009లో తన పనితీరును మెరుగుపరచుకొని 206 సీట్లను గెలుచుకొని తన పట్టును నిలుపుకుంది. అయితే ప్రస్తుతం 2009 ఫార్ములానే మరోసారి ఫాలో కావాలని హస్తం అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎలాగైనా 200 లోక్ సభ ఎంపీ స్థానాలను గెలుచుకుంటే విపక్షాలతో కలిసి 2009 మాదిరే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అంచనా వేసుకుంటుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ తాను పోటీ చేయనున్న స్థానాలను కూడా తగ్గించుకుంది. 2009లో ఆ పార్టీ అభ్యర్థులు 440 స్థానాల్లో పోటీలో ఉన్నారు. కానీ,ఈసారి ఆ సంఖ్యను కుదించుకొని 328 స్థానాల‌కు ప‌రిమితం చేసుకుంది. మిగతా స్థానాలను విపక్షాలకు వదిలేసింది.

    బిజెపి వేవ్ లో 200 సీట్లు సాధ్యమయ్యేనా..?

    దేశవ్యాప్తంగా ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా బిజెపి హవా నడుస్తుందనేది సెంటు పర్సెంట్ వాస్తవం. మోడీ మానియా.. హిందూ భావజాల వ్యాప్తి పెరిగిపోవడం,ఎన్డీఏ సర్కార్‌పై అవినీతి మరకలు లేక‌పోవ‌డం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా మారాయి. బిజెపి ఈసారి 400 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఆ పార్టీ అతిరథ,మహారాతులంతా..కాలికి బలపం కట్టకుండా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయిపోయారు. అయితే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ తాను టార్గెట్ గా పెట్టుకున్న 200 స్థానాల‌ను ఎలా గెలుచుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఉత్తర్ ప్రదేశ్,బీహార్, మహారాష్ట్ర,రాజస్థాన్, మధ్యప్రదేశ్,గుజరాత్,చత్తీస్గడ్,కర్ణాటక,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బిజెపి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇ

    ఇక తెలంగాణ,కర్ణాటక,కేరళ,చత్తీస్గడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ ఎంపీ స్థానాలు లేవు. అందువల్ల కాంగ్రెస్ ఉత్తరాది రాష్ట్రాల్లో చెప్పుకోదగిన సీట్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థానాలు గెలుచుకుంటే తాము అనుకున్న‌ట్లు 200 కాకున్నా.. 2004 కన్నా మెరుగైన సీట్లను గెలుచుకోవచ్చని అంచనా వేసుకుంటుంది. అయితే కాంగ్రెస్ అంచనాలు ఎలా ఉన్నా.. ఈసారి లోక్సభ ఎన్నికల్లో 200 ఎంపీ స్థానాలు గెలుచుకునేందుకు ఛాన్సెస్ చాలా తక్కువని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వారి అంచనాలు ఎలా ఉన్నా.. ఫలితాలు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ భవితవ్యం ఏంటి అనేది చెప్పగలం.