https://oktelugu.com/

యూపీఏకు కొత్త సారధి వచ్చేనా?

ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏ ఘోర పరాజయం పాలైంది. దీనికి ఎవరు బాధ్యులనే విషయమై కాంగ్రెస్ లో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు కావాలలని 23 మంది సీనియర్ నేతలు సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో పార్టీలో మార్పులు రావాలని అందరు ఆశిస్తున్నారు. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా  నియమించి యూపీఏ సారధిగా కొత్త వారిని నియమించాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో యూపీఏలో భారీ మార్పులు సాధ్యమేననిభావిస్తున్నారు. ఇందు కోసం పలు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 20, 2021 / 02:30 PM IST
    Follow us on


    ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో యూపీఏ ఘోర పరాజయం
    పాలైంది. దీనికి ఎవరు బాధ్యులనే విషయమై కాంగ్రెస్ లో భిన్నమైన వాదనలు
    వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కు శాశ్వత అధ్యక్షుడు కావాలలని 23 మంది సీనియర్
    నేతలు సోనియాగాంధీకి లేఖ రాశారు. దీంతో పార్టీలో మార్పులు రావాలని అందరు ఆశిస్తున్నారు. రాహుల్ గాంధీని అధ్యక్షుడిగా  నియమించి యూపీఏ సారధిగా కొత్త వారిని నియమించాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో యూపీఏలో భారీ మార్పులు సాధ్యమేననిభావిస్తున్నారు. ఇందు కోసం పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. పార్టీని గెలిపించే వారి కోసం గాలిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలను కూడగట్టి ఎన్డీఏను కట్టడి చేయాలని భావిస్తున్నాయి.

    ఓటమితోనైనా..
    ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో ఘోర  పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్
    ప్రస్తుతం ఆలోచనలో పడింది. ఓటమికి కారణాలపై అన్వేషిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీని విజయతీరాలకు నడిపించే  సత్తా ఎవరిలో ఉందని చూస్తున్నారు. అందుకే యూపీఏ చైర్మన్ గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరత్ పవార్ పేర్లు చిస్తున్నట్లు  తెలిసింది. వారైతే యూపీఏను సమర్తంగా ముందుకు నడిపించి విజయం సాధించేందుకు దోహదపడతారని భావిస్తున్నారు.

    అనారోగ్య కారణాలతో..
    యూపీఏ  చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న సోనియాగాంధీ కొద్ది రోజులుగా అనారోగ్య కారణాలతో  సరైన విధంగా సేవలందించడం లేదు. దీంతో  అధికార మార్పుపై నేతలు అభిలషిస్తున్నారు. కొత్త వారు చైర్ పర్సన్ గా రావాలని కోరుతున్నారు. దీంతో కొత్త నేతపై అటు నాయకులు, ఇటు కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.