https://oktelugu.com/

Karnataka Elections 2023 : కర్ణాటకను షేక్ చేస్తున్న బజరంగ్ దళ్ వివాదం.. రాజకీయాలను ఎందుకు మార్చింది!

మేనిఫెస్టోలో భాగంగా బజరంగ్‌ దళ్‌పై నిషేధం సహా కాంగ్రెస్‌కు మరో కోణం కూడా ఉంది. లోక్‌ నీతి–సీఎల్డీఎస్‌ పోల్‌ ప్రకారం ప్రతీ పది మంది ముస్లిం ఓటర్లలో దాదాపు అరుగురు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు

Written By:
  • NARESH
  • , Updated On : May 7, 2023 / 03:11 PM IST
    Follow us on

    Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికలకు ఇంకా మూడు రోజులే సమయం ఉంది. ప్రచారం మరో 24 గంటల్లో ముగియబోతోంది. హోరాహోరీగా సాగుతున్న ప్రచారంలో ‘బజరంగ్‌ దళ్‌ పై నిషేధం’ అంశం ఒక్కసారిగా గేమ్‌ చేంజర్‌గా మారే పరిస్థితులు ఉన్నాయి.

    కాంగ్రెస్‌ మేనిఫెస్టోతో..
    కర్ణాటకలో ఇప్పటికే అన్ని పార్టీలు మేనిపై మేనిఫెస్టో మాత్రం వివాదాస్పదంగా మారింది. తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌ దళ్‌పై నిషేధం విధిస్తామన్న కాంగ్రెస్‌ హామీ తీవ్ర చర్చకు కేంద్రంగా మారింది. దీని ప్రభావం కర్ణాటకకే పరిమితం కాకుండా తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాల్లోనూ చూపుతోంది. ‘బజరంగ్‌ దళ్‌’ కార్యకర్తలు కాంగ్రెస్‌ కార్యాలయాలను ముట్టడిస్తున్నారు. ప్రధాని మోడీ నుంచి బీజేపీ కార్యకర్త వరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో దీన్ని ప్రస్థావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హిందువులకు, హనుమాన్‌కు వ్యతిరేకం అని, అలాంటి పార్టీకి ఓట్లతోనే బుద్ధి చెప్పాలని, ఓటేసే ముందు జై బజరంగ బలి’ అని నినదించాలంటూ ప్రధాని పిలుపునిచ్చారు.

    బీజేపీ వ్యతిరేక పవనాలు..
    కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే వరకు అనేక కారణాల వల్ల రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచాయి. కానీ, కాంగ్రెస్‌ తన మేనిఫెస్టో విడుదల చేసి, అందులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఎస్‌ఐ), బజరంగ్‌ దళ్‌పై నిషేధం విధిస్తామని పేర్కొంది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారుతోంది. బీజేపీపై ఆ వ్యతిరేకత తగ్గుతూ వస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ హామీని వివాదాస్పదం చేసి, పదే పదే దీన్నే ప్రస్థావిస్తూ వస్తున్న బీజేపీ.. కాంగ్రెస్‌పై హిందువుల్లో వ్యతిరేకత పెరిగేలా పావులు కదుపుతోంది. బజరంగ్‌ దళ్‌ను పీఎఫ్‌ఎస్‌ఐతో పోలుస్తూ.. నిషేధం విధిస్తామని చెప్పడం హనుమాన్‌ భక్తులు మండిపడుతున్నారు.

    బీజేపీ ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా?
    మెజారిటీ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే, వ్యూహం ఫలిస్తుందా? లేదా అనేది ఇక్కడ ఆసక్తికరం. కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే, మొదటిది దక్షిణాదిలోని సామాజిక, సాంస్కృతిక నిర్మాణం ఉత్తర, పశ్చిమ భారతంలో కంటే చాలా భిన్నంగా ఉంటుంది. దక్షిణాదిలోనూ మతానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, ఉత్తర భారతంతో పోలిస్తే తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి, హిందుత్వ ఏకీకరణకు పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న బలమైన అధికార వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ ఒక్క అంశం సరిపోతుందా? అన్నది తెలియాల్సి ఉందని చెబుతున్నారు. కాకపోతే, కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల తర్వాత మాత్రం ఆ పార్టీపై కొంతమందిలోనైనా వ్యతిరేకత వచ్చిందనేది కాదనలేమని తెలిపారు.

    కాంగ్రెస్‌ వ్యూహం అదేనా..?
    మేనిఫెస్టోలో భాగంగా బజరంగ్‌ దళ్‌పై నిషేధం సహా కాంగ్రెస్‌కు మరో కోణం కూడా ఉంది. లోక్‌ నీతి–సీఎల్డీఎస్‌ పోల్‌ ప్రకారం ప్రతీ పది మంది ముస్లిం ఓటర్లలో దాదాపు అరుగురు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని, ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగతా వారు జేడీఎస్‌ లేదా బీజేపీలకు మద్దతిస్తున్నారు. బజరంగ్‌దళ్‌పై నిషేధం తరహా హామీ ద్వారా ఆ మిగతావారని సైతం తమ వైపునకు తిప్పుకుని ముస్లింలలో తమ మద్దతును మరింత పటిష్టం చేసుకోవాల నేది కాంగ్రెస్‌ వ్యూహమని విశ్లేషకులు చెబు తున్నారు. కాంగ్రెస్‌ సైతం వ్యూహాత్మకంగానే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామన్న హామీ ఇచ్చి ఉంటుందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హామీ ద్వారా ఏర్పడిన కొద్దిపాటి డ్యామేజీని కంట్రోల్‌ చేసుకోవడానికి, రాష్ట్ర, మంతటా హనుమంతుడి ఆలయాలు నిర్మి స్తామంటూ కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో ఈనెల 13న చూడాలి.