Congress Focus on Munugodu: మునుగోడు ఉప ఎన్నికపై మూడు పార్టీలు మళ్లగుల్లాలు పడుతున్నాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుందని తెలుస్తోంది. దీంతో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ బలాలు ప్రదర్శించుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రాటజీ అండ్ ప్రచార కమిటీ వేసింది. దీనికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను కన్వీనర్ గా నియమించింది.
ఈ కమిటీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డిని మాత్రం తీసుకోలేదు. దీంతో ఆయన విలువ తగ్గిందని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో వెంకటరెడ్డి మనుగడ కూడా ప్రశ్నార్థకంలో పడనుంది. పీసీసీ పీఠం కూడా దక్కకపోవడానికి పరోక్ష కారణం రాజగోపాల్ రెడ్డి అని అప్పట్లో టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి తీరు వెంకటరెడ్డి మెడకు చుట్టుకున్నట్లు అవుతోంది. సోదరుడి నిర్వాకంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం.
Also Read: Banks Write Off Loans: కార్పొరేట్ ఎగవేతదారులకు వేల కోట్లు మాఫీ.. సామాన్యుడికి ఏదీ?
మునుగోడు ఉప ఎన్నిక జరిగితే తమకే అనుకూలంగా ఫలితం వస్తుందని మూడు పార్టీలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. సిట్టింగ్ స్థానం కావడంతో తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతుండగా రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వస్తారని దీంతో తమ పార్టీయే విజయదుందుబి మోగిస్తుందని బీజేపీ భావిస్తోంది. మరోవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ సైతం తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నేతలు ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.
కమిటీ కూర్పులో వెంకటరెడ్డి పేరు లేకుండా చేసింది అధిష్టానం. దీనికి గాను రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ కు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి తీరుతో కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. ఇన్నాళ్లు పార్టీకి సేవ చేస్తారని భావించినా ఆపద కాలంలో హ్యాండిచ్చిన రాజగోపాల్ రెడ్డి ని ఓడించి మళ్లీ తమ పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. వెంకటరెడ్డి ఎంపీ స్థానంలోకి మునుగోడు వచ్చినా కమిటీలో ఆయన పేరు లేకుండా చేసి ఆయనకు షాక్ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంతో వెంకటరెడ్డి కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారని సమాచారం.
Also Read:BJP Politics: టీఆర్ఎస్ వాళ్లు కష్టం.. కాంగ్రెస్ వాళ్లు జాప్యం.. బీజేపీ బలోపేతమెప్పుడు?