https://oktelugu.com/

KTR- BJP- Congress: రివర్స్‌ పంచ్‌: కేటీఆర్‌ పై కాంగ్రెస్, బీజేపీ కౌంటర్‌ అటాక్‌!

KTR- BJP- Congress:  రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి రెండు రోజుల క్రితం వరంగల్‌ పర్యటనలో చేసిన దుర్బాషలు, తిట్ల పురాణ సంభాషణపై ప్రతిపక్షాలు కౌంటర్‌ ఎటాక్‌ షురూ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన కేటీఆర్‌ను ఇప్పుడు అంతే వేగంగా.. అదే పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కేటీఆర్‌తోపాటు కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నాయి. -తిట్టిపోసిన కొండా సురేఖ.. మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2022 / 03:23 PM IST
    Follow us on

    KTR- BJP- Congress:  రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి రెండు రోజుల క్రితం వరంగల్‌ పర్యటనలో చేసిన దుర్బాషలు, తిట్ల పురాణ సంభాషణపై ప్రతిపక్షాలు కౌంటర్‌ ఎటాక్‌ షురూ చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడిన కేటీఆర్‌ను ఇప్పుడు అంతే వేగంగా.. అదే పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. కేటీఆర్‌తోపాటు కేటీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నాయి.

    KTR

    -తిట్టిపోసిన కొండా సురేఖ..
    మంత్రి కేటీఆర్‌ వరంగల్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటనను ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా విరుచుకుపడిన కొండా సురేఖ వరంగల్‌ లో ఎక్కడ అభివృద్ధి చేశారో కేటీఆర్, కేసీఆర్‌ చూపించాలని సవాల్‌ విసిరారు. ‘వరంగల్‌ ప్రజలార జాగ్రత్త! ఇంటి బయట మీ సామాన్లు ఏమన్న ఉంటే లోపలకు తీసుకపోండి, లేకుంటే అవి కూడ తాకట్టు పెట్టి అప్పు చేసేలా ఉన్నాడు కేసీఆర్‌’ అంటూ కొండా సురేఖ పేర్కొన్నారు.

    konda surekha

    అంతేకాదు దానికి కూడా కమీషన్లు తీసుకుంటారు ఈ తండ్రీ కొడుకులు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. వరంగల్లో రాహుల్‌ గాంధీ సభ ఉడడంతో గతంలో కేసీఆర్‌ శంకుస్థాపన చేసిన టెక్స్‌టైల్‌ పార్కుకు మళ్లీ కేటీఆర్‌ శకుస్థాపన చేశారని విరుచుకుపడ్డారు. మీరు ఏమి చేసినా మీ అధికారం పోవటం మాత్రం ఖాయం అంటూ శాపనార్ధాలు పెట్టారు. ‘కేటీఆర్‌.. వరంగల్‌! ఇది చైతన్యానికి, ఆత్మాభిమానానికి పుట్టినిల్లు. ఇన్ని రోజులు మోసం చేసి ఇప్పుడు వచ్చి శంకుస్థాపనలంటే నిన్ను నీ అయ్యను నమ్మటానికి జనాలు గొర్రెలేమీ కాదు. మీ నయవంచన గ్యాంగును గద్దె దించడమే లక్షంగా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు’ అంటూ నిప్పులు చెరిగారు. వరంగల్‌లో కేటీఆర్‌ నిర్వహించాల్సిన సభ టెంట్‌ కూలిపోవడంపైనా సెటైర్లు వేశారు.

    Also Read: TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?

    ‘తెలంగాణ సామెత… ఒక పనిమంతుడు పండుగ ఉందని పందిరి వేస్తే.. కుక్క తోక తాకితే కూలిపోయింది అంట’ అంటూ వరంగల్‌లో కేటీఆర్‌ గారి పనితనం గురించి చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయని ముందుగానే టెంటు కూలిందని కొండా సురేఖ ఎద్దేవా చేశారు.

    -కేటీఆర్‌ కుక్కను కరిచారు.. ఎంపీ అరవింద్‌
    వరంగల్‌లో మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కూడా ఎదురుదాడి కొనసాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ నోటికొచ్చినట్టు మాట్లాడారని నిప్పులు చెరుగుతున్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలపై మండిపడిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ 111 జీవోకు తూట్లు పొడిచి జన్వాడ ఫాంహౌస్‌ కట్టారని విమర్శలు చేశారు. జన్వాడ ఫాంహౌస్‌పై, రాష్ట్రంలో సాగుతున్న బియ్యం దందాపై íసీబీఐ విచారణకు ఎన్వోసీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఉత్తరకుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్‌ ఖాన్‌ లను కలిపితే కేటీఆర్‌ అని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌కు ట్రీట్మెంట్‌ అవసరమని ధర్మపురి వ్యాఖ్యానించారు.

    Arvind Dharmapuri

    -కొకైన్‌ టెస్ట్‌ కు రెడీనా?
    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తంబాకు తింటారు అంటూ కేటీఆర్‌ చేసిన ఆరోపణలకు రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చిన ధర్మపురి అరవింద్‌ బండి సంజయ్‌ తంబాకు టెస్ట్‌కు బండి సంజయ్‌ని తాను తీసుకొస్తానని కొకైన్‌ టెస్ట్‌కు కేటీఆర్‌ రావాలి రెడీనా.. ఏమంటారు వస్తారా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ కుక్కను కరిచాడు అని, అందుకే ఆయన చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.

    Bandi Sanjay

    – నిధులపై ప్రతి సవాల్‌..
    కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ స్పందించారు. కేంద్రం పన్నల వాటా రూపంలో రూ.1.68 కోట్లు, అభివృద్ధి, ప్రాయోజిత పథకాలు, రహదారులకు మరో రూ.1.60 లక్షల నిధులు మంజూరు చేసిందని వివరించారు. నిధుల మంజూరై కేసీఆర్, కేటీఆర్‌ ఎక్కడ చర్చ పెట్టినా లెక్కలతో సహా నిరూపిస్తామని సవాల్‌ చేశారు. దమ్ముంటే చర్చ పెట్టాలన్నారు.

    -డిఫెన్స్‌లో గులాబీ కేడర్‌..
    తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్‌ ప్రసంగాలకు, సవాళ్లకు గతంలో ప్రతిపక్షాల నుంచి కౌంటర్‌ ఉండేది కాదు, పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు పార్టీలు రాష్ట్రంలో దూకుడు పెంచాయి. అధ్యక్షుల బాటలో పార్టీ నేతలను కూడా సవాళ్లకు ప్రతిసవాల్‌ చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ రాష్ట్రంలో తమకు తిరుగులేదనుకున్న గులాబీ నేతలు ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్‌లో పడుతున్నారు. వరి కొనుగోళ్ల నుంచి నిధుల కేటాయింపు వరకు, అభివృద్ధి నుంచి కేంద్రం ఇచ్చే నిధుల వరకు.. కుంభకోణాల నుంచి నిజాయతీ నిరూపించుకునే వరకూ అన్నింటికీ ప్రతిపక్షాలు సై అంటుండడంతో టీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో నైరాశ్యం కనిపిస్తోంది.

    Also Read:PM Modi Jammu Kashmir Visit: కశ్మీర్ ప్రగతికి కేంద్రం పెద్దపీట.. 24న ప్రధాని పర్యటన సందర్బంగా ఉత్కంఠ

    Recommended Videos:

    Tags