T Congress: వారిద్దరు ‘చేయి’ కలిపినట్లేనా?

T Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని కోల్పోవడంతో క్యాడర్ మొత్తం నిస్తేజంగా మారింది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంటూ గ్రూపు వార్ నడుస్తుంది. ఆధిపత్యం కోసం నేతలు పాకులాడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి. మొన్నటి వరకు టీపీసీసీ కోసం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న లాబీయింగ్ అంతా ఇంతా కాదు. అదేదో సీఎం పదవీ అన్న రేంజులో నేతలు కుస్తీపాట్లు పట్టారు. చివరికి […]

Written By: NARESH, Updated On : December 1, 2021 11:36 am
Follow us on

T Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని కోల్పోవడంతో క్యాడర్ మొత్తం నిస్తేజంగా మారింది. దీనికితోడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంటూ గ్రూపు వార్ నడుస్తుంది. ఆధిపత్యం కోసం నేతలు పాకులాడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి అందివచ్చిన అవకాశాలన్నీ చేజారిపోతున్నాయి.

T Congress Leaders

మొన్నటి వరకు టీపీసీసీ కోసం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న లాబీయింగ్ అంతా ఇంతా కాదు. అదేదో సీఎం పదవీ అన్న రేంజులో నేతలు కుస్తీపాట్లు పట్టారు. చివరికి ఆ పదవీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి దక్కింది. కొత్త పీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది.

అయితే సీనియర్లు మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఒప్పుకోవడం లేదు. దీంతో అధిష్టానం రంగంలోకి దిగి కొందరిని సెట్ రైట్ చేసింది. అయితే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం బహిరంగగానే అధిష్టానంపై, రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రేవంత్ పీసీసీగా ఉన్నంత కాలం గాంధీ భవన్ మెట్లు ఎక్కబోనంటూ శపథం సైతం చేశారు.

అందుకు తగ్గట్టుగానే కొద్దిరోజులుగా ఆయన వ్యవహరశైలి నెలకొంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఏ పిలుపునిచ్చినా ఆయనపాల్గొన్న దాఖలాల్లేవు. దీనికితోడు హుజూరాబాద్ కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలవడానికి రేవంతే కారణమంటూ కోమటిరెడ్డి ఫైరయ్యారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ మాత్రం పెద్దగా స్పందించలేదు.

ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ నిరసన చేపట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ ధర్నా కార్యక్రమంలో టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు చేతులు కలిపారు. కాంగ్రెస్ భవిష్యత్ దృష్ట్యా తాము ఐక్యం పోరాటాలు చేసేందుకు సిద్ధమనే సంకేతాలను క్యాడర్ కు పంపించారు.

Also Read: ధాన్యం కొనుగోళ్లు.. కేసీఆర్ ను లాజిక్ తో కొట్టిన రేవంత్

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డిలు ఒక్కటవడంపై కాంగ్రెస్ లోని సీనియర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ కలియిక ఎంతకాలం ఉంటుందనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల సమయానికి టికెట్ల గొడవ, ప్రచారం వంటివి వీరి మధ్య చిచ్చు పెడుతాయా? అనేది కూడా తేలాల్సి ఉంది.

ఇప్పటికే సీనియర్లు తమ అనుచరులను నియోజకవర్గ ఇన్ ఛార్జులుగా నియమించాలని రేవంత్ పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వీరి కలయిక కూడా కేవలం ఫోటోలకే పరిమితం అవుతుందా? లేదంటే దీర్ఘకాలం కొనసాగుతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!

Also Read: కాంగ్రెస్ బలోపేతం.. టీఆర్ఎస్ కు ఆనందమా?