Congress 5 State Elections 2022: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి ఏర్పడింది. అభ్యర్థుల భవితవ్యం బయటపడనుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో పార్టీలు అందుకనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తాము విజయం సాధించే చోట్ల ఎలాగైనా ప్రతిపక్షాల గాడిలో పడకుండా ఉండేందుకు ప్రణాళికలు ఖరారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గోవాలో కూడా హంగ్ ఏర్పడుతుందని చెప్పినందున కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. పనాజీకి ముఖ్య నేతల్ని పంపించింది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అక్కడ ఉండి పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.

ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడుతుందని అంచనాలు వేసిన సందర్భంలో పార్టీలు కూడా అందుకు సిద్ధమయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాతో పరిస్థితులు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం ఏ రకమైన వ్యూహాలు రచించాలో అనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. గతంలో జరిగిన పొరపాట్లు ప్రస్తుతం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చిన బీజేపీ వ్యూహాత్మకంగా అదికారం చేజిక్కించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అలా జరగకుండా చూసేందుకు నేతలు సమాయత్తమయ్యారు.
Also Read: టీఆర్ఎస్ అసంతృప్తుల భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు
మాజీ కేంద్ర మంత్రి చిదంబరం, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శివకుమార్ పనాజీ చేరుకుని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. పార్టీకి వచ్చే సీట్లపై అంచనాలు వేసుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇదివరకే కర్ణాటక, మధ్యప్రదేశ్ లో సొంత నిర్ణయాల ప్రభావంతో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి మాత్రం ఏ తప్పు చేయకుండా తమ అభ్యర్థులను కంట్రోల్ చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో కాంగ్రెస్ పార్టీ నేతల్ని తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ అధికారం చేజిక్కించుకోవడం తెలిసిందే.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసపోకుండా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందోనని చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు సైతం హంగ్ అసెంబ్లీకే అవకాశం ఉందని చెప్పడంతో ఇతర పార్టీల నేతల్ని బుజ్జగించాలని కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో తమ బలాబలాలు పెంచుకోవాలని అన్ని పార్టీలు రెడీ అవుతున్నట్లు సమాచారం. కానీ ఏ మేరకు తమ ప్రభావం చూపుతాయో అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: ఈ సారి కూడా కేసీఆర్ పాచిక పారనుందా?