Teacher unions: జగన్ కు తలపోటు స్టార్ట్.. రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

Teacher unions: ఏపీలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఆయన ఇబ్బంది పడటంతోపాటు ప్రజలను సైతం ఇబ్బందులపాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపు వివాదం నెలకొంది. జగగన్ సర్కార్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సినిమా వాళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటంతో ఈ వివాదం చినికిచికినికి గాలివానలా మారింది. రాజకీయ నాయకుల ఆస్థులు, […]

Written By: NARESH, Updated On : January 20, 2022 11:42 am
Follow us on

Teacher unions: ఏపీలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటూ ఆయన ఇబ్బంది పడటంతోపాటు ప్రజలను సైతం ఇబ్బందులపాలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వరకు ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపు వివాదం నెలకొంది.

Teacher unions:

జగగన్ సర్కార్ వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు సినిమా వాళ్లపై నోటికొచ్చినట్లు మాట్లాడటంతో ఈ వివాదం చినికిచికినికి గాలివానలా మారింది. రాజకీయ నాయకుల ఆస్థులు, సినిమా వాళ్ల ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్దమా? అంటూ సవాళ్లు విసురుకునే దాకా వచ్చింది.

Also Read: జగన్ కు తలపోటు స్టార్ట్.. రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

ఈ వివాదం పెద్దగా మారుతున్న క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవిని రంగంలోకి దింపారు. ఆయన్ని లంచ్ కు ఆహ్వానించి సినిమా సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికి వివాదం సర్దుమణిగింది. అయితే ఈ వివాదం ముగిసిందో లేదో ఏపీలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

అపరిష్కృంగా ఉన్న సమస్యలతోపాటు పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఉద్యోగులు సమ్మెకు వెళ్లగా ప్రభుత్వం చర్చల పేరుతో ఉద్యోగులకు కొన్ని హామీలిచ్చింది. ఈక్రమంలోనే ఉద్యోగులు డీఏలను క్లియర్ చేసిన ప్రభుత్వం హెచ్ఆర్ఏ లో కోతలు విధించింది. దీంతో ఒక్కో ఉద్యోగి జీతంలో 5వేల నుంచి 6 వేల వరకు కోతపడుతుందని తెలుస్తోంది.

ప్రభుత్వం నిర్ణయంపై ఆగ్రహం చేస్తూ ఉద్యోగ సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈమేరకు నేడు అన్ని జిల్లాలో కలెక్టరేట్లను ముట్టడించాలని ఉద్యోగ సంఘాల నాయకులు తీర్మానించారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందనే కారణంతో బుధవారం రాత్రి నుంచే ఉద్యోగ సంఘాల నాయకులను అడ్డుకుంటున్నారు.

నేటి కలెక్టరేట్ల ముట్టడి అనుమతి లేదంటూ ఉద్యోగులను గృహ నిర్బంధాలు చేస్తున్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఉద్యోగులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి.  మరోవైపు ఉద్యోగులు మాత్రం కలెక్టరేట్ల ముట్టడిని విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ వివాదం కాస్తా సీఎం జగన్మోహన్ రెడ్డికి మరింత తలనొప్పి తెచ్చేలా మారడం ఖాయంగా కన్పిస్తోంది.

Also Read: మనిషికి ఆనందాన్ని కలిగించేవి ఇవే !