KTR: హైదరాబాద్ ఇప్పుడు నిఘా నీడన ఉంది. కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంది. ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఎవరు చేసిన వ్యాఖ్యల వల్ల హైదరాబాద్ కు ఈ దుస్థితి దాపురించింది? దీనిపై నెటిజన్లు చేస్తున్న కామెంట్లు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి.
మునావర్ ఫారుఖీ కామెడీ షో నే కారణమా?
కొద్ది రోజుల క్రితం హైదరాబాదులో వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ కామెడీ షో నిర్వహించాడు. ఈ షో నిర్వహించేందుకు వందలాదిమంది పోలీసులను భద్రత కోసం ప్రభుత్వం ఉపయోగించింది. వాస్తవానికి ఫారూఖీ తో కామెడీ షో నిర్వహిస్తామని మంత్రి గతంలోనే కేటీఆర్ పేర్కొన్నారు. అయితే దీనిపై అప్పట్లో భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. కేటీఆర్ వ్యాఖ్యల పట్ల బిజెపి నాయకులు విమర్శలు చేశారు. అయితే దీనిని మనసులో పెట్టుకున్న కేటీఆర్ ఎలాగైనా మునావర్ తో కామెడీ షో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో కామెడీ షో నిర్వహించారు.
Also Read: Mukesh Ambani: రూ.630 కోట్లతో దుబాయ్ తీరంలో ఖరీదైన విల్లా కొన్న అంబానీ.. ఎవరికోసమో తెలుసా?
అప్పుడే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల మహమ్మద్ ప్రవక్త పై బిజెపి నాయకురాలు నూపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ముస్లిం దేశాలు దీని ఖండించాయి కూడా. నష్ట నివారణ చర్యలకు దిగిన బిజెపి నుపూర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పట్లో కొద్ది రోజులపాటు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. అప్పటి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఖతార్ పర్యటనలో ఉన్నప్పుడు ఆదేశ దౌత్య వేత్తలు నూపుర్ శర్మ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. అయితే మునావర్ తో కామెడీ షో నిర్వహిస్తే ఆ వేదికను తగలబెడతానని, అతడి పై దాడి చేస్తానని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో అతడిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇదే సమయంలో అతడు మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాని కారణమయ్యాయి. దీంతో స్పందించిన పార్టీ అధినాయకత్వం అతడిని సస్పెండ్ చేసింది. ఇది హైదరాబాదులో ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులకు ముందు జరిగిన పరిణామాలు.
ఈ పరిస్థితులకు కేటీఆరే కారణం
ప్రస్తుతం హైదరాబాదులో ఏర్పడిన పరిస్థితులకు మంత్రి కేటీఆరే కారణం అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హిందూ దేవతలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసే మునావర్ తో స్టాండప్ కామెడీ షో నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాదు లాంటి సున్నితమైన ప్రాంతాల్లో భావోద్వేగాలని రెచ్చగొట్టే మునావర్ లాంటి వారి వల్ల విద్వేషాలు చినరేగుతాయని కేటీఆర్ కు తెలియదా అని నిలదీస్తున్నారు. ట్విట్టర్ లో “#కేటీఆర్ డిస్ట్రబ్డ్ హైదరాబాద్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఢిల్లీలో కూడా మునావర్ కామెడీ షో చేస్తానని దరఖాస్తు చేసుకోగా అక్కడి ప్రభుత్వం తిరస్కరించడం గమనార్హం. అయితే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతడి పై పీడీ యాక్ట్ నమోదు చేసింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్న క్రమంలో ఒకవేళ అతనిపై మోపిన అభియోగాలన్నీ రుజువైతే ఏడాది పాటు రాజాసింగ్ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేటీఆర్ కు వ్యతిరేకంగా నైటిజన్లు ఫైర్ అవుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ నుంచి ఎటువంటి కౌంటర్లు రాకపోవడం గమనార్హం.