Weather: రోజు రోజుకు చలి పెరుగుతుంది. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా ప్రజలు భయపడుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆరుబయటకు రావాలనే ధైర్యం కూడా చేయడం లేదు చాలా మంది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది అంటున్నారు అధికారులు. ఆంధ్రప్రదేశ్, యానంలోని దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయట. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయి అంటుంది వాతావరణ శాఖ. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని మాత్రం స్పష్టం చేసింది. దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. ఇక తెలంగాణలో కూడా చాలా చలి ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పనులకు వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రాలో మాత్రమే కాదు దేశం అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ఉంది చలి.
ఉత్తర భారతదేశంలో వర్షం కారణంగా, వాతావరణం దారుణంగా మారింది. దీంతో మైదాన ప్రాంతాల్లో చలి మరింత పెరిగింది. దేశంలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా మైదాన ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. దీంతో చలి మరింత పెరిగుతుంది. అదే సమయంలో రానున్న 5 రోజుల్లో వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండదు అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక పశ్చిమ బెడద, తూర్పు గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. జనవరి 14 రాత్రి నుంచి వాతావరణం కాస్త మారనుంది.
జనవరి 12-16 మధ్య పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో పొగమంచు పడే అవకాశం ఉంది. ఇక వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ యాక్టివేషన్ కారణంగా, జనవరి 15 నుంచి 17 వరకు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం, మంచు కురుస్తుంది. యాక్టివ్ వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా, ఈరోజు ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో ఉదయం పూట పొగమంచు, ఓ మోస్తరు పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 17, 11 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయి.
చలిగాలుల కారణంగా జమ్మూకశ్మీర్‌లో వణుకు పెరిగింది. లోయలోని అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువగా ఉంది. పహల్గాం, గుల్‌మార్గ్‌లలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. జనవరి 12న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక పొగమంచు, వర్షం ఉత్తర భారతదేశంలో చలి తీవ్రతను పెంచాయి. ఢిల్లీ, ఎన్‌సీఆర్, యూపీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. సాయంత్రం పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షం కారణంగా చలి మరింత పెరిగింది. రానున్న రోజుల్లో మంచు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. యూపీలోని మొరాదాబాద్, ఝాన్సీలలో పొగమంచు కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రైలు రాకపోకలపైనా ప్రభావం పడింది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు..