Cold Intensity: చలిపులి పంజా విసురుతోంది. మొన్నటి వరకు కాస్త తగ్గినట్టే కనిపించిన చలి.. మళ్లీ పెరిగిపోయింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రతాపం చూపిస్తోంది. మార్నంగ్ 10 అయినా సరే చలి విడువట్లేదు. దేశంలో ఈశాన్య , వాయవ్య దిశల నుంచి వస్తున్న గాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇక ఏజెన్సీ ఏరియాల్లో అయితే సింగిల్ డిజిట్‌కు ఉష్టోగ్రతలు తగ్గుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇక గిరిజనులు అయితే మార్నింగ్ 11 అయినా సరే దట్టమైన పొగ మంచులోనే గడిపేస్తున్నారు. ఏపీలో ఈ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఆదిలాబాద్ లో మరీ ఎక్కువగా చలి పెడుతోంది. ఇక అటు ఏపీ విషయానికి వస్తే విశాఖ జిల్లాలో ఉండే ఏజెన్సీ ఏరియాల్లో మధ్యాహ్నం 12 గంటల దాకా కూడా తీవ్రంగా చలి పెడుతోంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మత్రం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18.6 డిగ్రీలకు పడిపోయాయి. అలాగే రంగారెడ్డిలో కూడా ఉష్ణోగ్రతలు 15.7 డిగ్రీలుగా నమోదు అయ్యాయి.
మేడ్చల్ లో 16.5 డిగ్రీల కనిష్టఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే.. కొద్ది రోజులుగా కనిష్ఠ అలాగే గరిష్ట ఉష్ణోగ్రతల నడుమ తేడా అనేది నాలుగైదు డిగ్రీల కంటే ఎక్కువ ఉండట్లేదు. అంటే చలి పులి ఏ రేంజ్‌లో పంజా విసురుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీలో అయితే రాబోయే మరికొద్ది రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Also Read: KCR Rythu Bandhu: రైతుబంధు తమ ఘనతగా చెప్పుకుంటున్న కేసీఆర్.. లాభం మాత్రం ఎవరికి?
తెలంగాణలో ఉత్తరాన ఉన్న అసిఫాబాద్ జిల్లాలో 10.4 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఏపీలో కూడా కొన్ని చోట్ల దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ముఖ్యంగా లంబసింగి, అరకు ఏరియాల్లో కూడా తెలంగాణ మాదిరగానే కనిష్ఠంగా 10 డిగ్రీల్లోనే ఉష్ణోగ్రత ఉంటోంది. ఇది ఏపీలో అత్యంత తక్కువ అని సమాచారం. పగలు కూడా పెద్దగా వేడి లేకుండా చలిగానే ఉంటోందని చెబుతున్నారు ఈ ఏరియా వాసులు. ఉదయం పూట పనులకు వెళ్లే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Also Read: RK Roja: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం రెడీ?