Homeజాతీయ వార్తలుCockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ వెనుక పాకిస్థాన్ హస్తం.. ఇదిగో రుజువు

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ వెనుక పాకిస్థాన్ హస్తం.. ఇదిగో రుజువు

Cockroach Janata Party: ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే జనాలు ఓట్లు వేయాలి.. ప్రత్యర్థి పార్టీకి మించి ఓట్లు వస్తేనే అధికారాన్ని దక్కించుకోవడానికి సాధ్యమవుతుంది. అలాకాకుండా కేవలం సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను చూసి అధికారంలోకి వస్తామనుకుంటే అంతకు మించిన భ్రమ ఇంకొకటి ఉండదు. సోషల్ మీడియా ప్రామాణికమైతే ఇన్స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీకి 100 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటప్పుడు ఆయన మన దేశానికి ప్రధానమంత్రి కావాలి కదా..

కొంతమంది ఏదో ఆగ్రహంలో పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఏకంగా బిజెపి పార్టీకి మించిన ఫాలోవర్స్ ను సంపాదించుకొని కలకలం రేపుతుంది. దీనిని చాలామంది జనరేషన్ జెడ్ తరంలో రగిలిన ఉద్యమం అని పిలుస్తున్నారు. ఇది సార్వత్రిక ఎన్నికల్లో పెను మార్పుకు నాంది పలుకుతుందని జోస్యం చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి సంచలన విషయాలు తెరపైకి వచ్చినప్పుడు.. కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు రకరకాలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఇలాంటివారు కొద్ది రోజులు మీడియాలో హల్చల్ చేస్తారు. ఆ తర్వాత జనం మర్చిపోతారు.

మనదేశంలో ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంది. దానికంటూ బలమైన నిర్మాణం ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేస్తే.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అధికారాన్ని కట్టబెడతారు. ఒకవేళ రెండు పార్టీలు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకోకపోతే.. మూడో పార్టీకి అధికారాన్ని దక్కేలా చేస్తారు. అంతేతప్ప సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఆధారంగా అధికారాన్ని కట్టబెట్టరు.. తాత్కాలిక ఆవేశాలు వేరు.. దీర్ఘకాలిక ప్రణాళికలు వేరు. రెండు కూడా ఒకే విధంగా ఎప్పుడూ ఉండవు. ఇక కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో పాకిస్తాన్ హస్తము ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.. ఎప్పుడైతే ఈ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోవర్స్ నమోదయ్యారో.. అప్పుడే కొంతమంది దీని వెనక ఏదో జరుగుతోందని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే పరిశోధన మొదలుపెట్టారు. చివరికి అసలు నిజాన్ని బయటపెట్టారు.

కాక్రోచ్ జనతా పార్టీ ని అనుసరిస్తున్న ఫాలోవర్స్ లో పాకిస్తాన్ నుంచి 49 శాతం, అమెరికా నుంచి 14 శాతం, బంగ్లాదేశ్ నుంచి 14%, ఇండియా నుంచి తొమ్మిది శాతం, యూకే, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇతరులు మూడు శాతం, యూఏఈ నుంచి రెండు శాతం అనుసరిస్తున్నారు. దీని వెనక కుట్ర కోణం ఉందని.. అందువల్లే ఓవర్ నైట్ లో కాక్రోచ్ జనతా పార్టీకి ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉన్నారని సోషల్ మీడియాలో బిజెపి అనుకూల వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular