https://oktelugu.com/

Sri Reddy: సీఎం కొడుకును హోటల్‌లో కలిశా… బెడ్‌ షేర్‌ చేసుకున్నాం.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్‌!

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో ‘ఇదు కదిర్వేలన్‌ కాదల్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు పార్క్‌ హయత్‌ హోటల్‌లో తనతో ఉదయనిధి బెడ్‌ కూడా షేర్‌ చేసుకున్నాడు అని శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ ద్వారా తాను ఉదయనిధిని కలిశానని తెలిపింది. రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం […]

Written By: , Updated On : April 27, 2022 / 07:59 PM IST
Follow us on

Sri Reddy: వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో ‘ఇదు కదిర్వేలన్‌ కాదల్‌’ షూట్‌ చేస్తున్నప్పుడు పార్క్‌ హయత్‌ హోటల్‌లో తనతో ఉదయనిధి బెడ్‌ కూడా షేర్‌ చేసుకున్నాడు అని శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేసింది.. ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ హీరో విశాల్‌ ద్వారా తాను ఉదయనిధిని కలిశానని తెలిపింది. రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. ఇంత వరకు ఏ సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదని శ్రీరెడ్డి ఆరోపించింది.

Sri Reddy

Sri Reddy

-ఎన్నికల్లో గెలిచాక హ్యాపీగా ఫీల్‌ అయ్యా…
ఉదయనిది స్టాలిన్‌ ఎన్నికలలో గెలిచినప్పుడు కూడా తాను హ్యాపీగా ఫీలయ్యానని శ్రీరెడ్డి వెల్లడించింది. ఒక మామూలు హీరోగా ఉన్న ఉదయనిది స్టాలిన్‌ మంత్రి అయ్యాక తన ఆనందానికి అవధులు లేవు అంటూ కూడా తెలిపింది శ్రీరెడ్డి.

Also Read: Oil Price: మంట రేపుతున్న వంటనూనెలు.. ధర పెరుగుదలతో ఏపీ ప్రజలు విలవిల

-తమిళనాడులో శ్రీరెడ్డి కామెంట్స్‌ కుదుపు..

నటుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు ఉదయనిధిపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి కామెంట్స్‌ సినిమా ఇండస్ట్రీతోపాటు, తమిళనాడులో సంచలనంగా మారాయి. గతంలో సురేశ్‌ ప్రొడక్షన్‌ అధినేత సురేశ్‌బాబు, నటుడు దుగ్గబాటి రాణా సోదరుడితో శ్రీరెడ్డి సినిమా అవకాశాల కోసం బెడ్‌ షేర్‌ చేసుకున్నానని తెలిపి బాంబు పేల్చింది.. తనను ఇండస్ట్రీ దూరం పెట్టిన సమయంలో ఆమె ఈమేరకు రాణా సోదరుడితో ఉన్న సంబంధాలను బయటపెట్టడంతోపాటు వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియో, కామెంట్స్‌ అప్పట్లో సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఉదయనిధిపై చేసిన కామెంట్స్‌ ఇప్పుడు అటు తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీతోపాటు, ఇటు రాజకీయంగా సంచలనంగా మారాయి.

-తమిళ రాజకీయాల్లో హీట్..

Sri Reddy

Sri Reddy

తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధిపై శ్రీరెడ్డి చేసిన సంచలన కామెంట్స్‌ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఏడాదిగా ఎలాంటి ఆరోపణలు లేకుండా పాలన సాగిస్తున్న సీఎం స్టాలిన్‌ ఇప్పుడు తన కుమారుడిపైనే ఆరోపణలు రావడంతో తల పట్టుకుంటున్నారు. నటి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్‌పై తండ్రీ, కొడుకు ఎవరూ నోరు మెదపడం లేదు. ఇది రాజకీయ రంగు పులుముకోకముందే ఆరోపణలకు చెక్‌ పెట్టాలని డీఎంకే నేతలు భావిస్తున్నారు. మరికొందరు గవర్నర్‌ వ్యవస్థ, అధికారాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకులే నటి శ్రీరెడ్డితో ఈ కామెంట్స్‌ చేయించారని ఆరోపిస్తున్నారు. శ్రీరెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ తెలుసని అంటున్నారు. అయినా గతంలో రాణా సోదరుడిలా.. ఉదయనిధితో ఉన్న వీడియో బయటపెడితే తమ పరిస్థితి ఏమిటని డీఎంకీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీఎం తనయుడు ఉదయనిధి ఈ కామెంట్స్‌పై మౌనం వహిస్తుండడం ఆ పార్టీ నేతలను పునరాలోచనలో పడేస్తోంది.

-తెలుగు వారికీ సుపరిచితుడే..

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన 2012లో తమిళంలో తీసిన ఓకే ఓకే సినిమా తెలుగులోకి డబ్‌ అయింది. 2014లో తమిళ సినిమా ఇదు కాథిర్వలన్‌ సినిమా సీనుగాడి లవ్‌స్టోరీగా తెలుగులో రిలీజ్‌ అయింది. 2018లో ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య ను తమిళంలో ఉదయనిధి తీశాడు. 2020లో సైకో సినిమాల ద్వారా ఉదయనిధి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆయనపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి చేసిన సంచలన కామెంట్స్‌ ఇటు తెలుగు ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు రేపుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌తో సభ్యత్వం కోసం అర్ధనగ్న ప్రదర్శన ద్వారా సంచలనం రేపిన శ్రీరెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడినే టార్గెట్‌ చేయడం వెనుకు ఎవరైనా ఉన్నారా.. లేక వాస్తవమేనా అన్న చర్చ జరుగుతోంది.

Also Read:Abu Dhabi: బాల్కనీలో బట్టలు ఆరేస్తే అంతే.. రూ.20 వేల జరిమానా కట్టుకోవాల్సిందే

Recommended Videos:

Tollywood Pan India Movies that should come before Bahubali ||  Oktelugu Entertainment

Bad News For Nidhi Agarwal || Pawan Kalyan Hari Hara Veera Mallu Update || Oktelugu Entertainment

Tags